Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్ను కిడ్నాప్ చేసి.. ఆపై వ్యవహారాన్ని నడిపిందల్లా ఓ మహిళ: భావన

మలయాళ నటి భావన కిడ్నాప్, కార్లో ఆమెపై లైంగిక వేధింపుల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పల్సర్ సుని అనే గ్యాంగ్ భావనను కిడ్నాప్ చేసిందని పోలీసుల విచారణలో తేలింది. అయితే భావన తాజాగా

Advertiesment
Shocking
, మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (10:40 IST)
మలయాళ నటి భావన కిడ్నాప్, కార్లో ఆమెపై లైంగిక వేధింపుల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పల్సర్ సుని అనే గ్యాంగ్ భావనను కిడ్నాప్ చేసిందని పోలీసుల విచారణలో తేలింది. అయితే భావన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కిడ్నాప్ వ్యవహారాన్ని నడిపింది ఓ మహిళ అంటూ తెలిపింది. పల్సర్ సుని గ్యాంగ్ తనను కిడ్నాప్ చేసి కార్లో తనను వేధిస్తున్న సమయంలో క్రమం తప్పకుండా సునికి ఫోన్ కాల్స్ వచ్చాయని.. అతడికి ఎప్పటికకప్పుడు ఆదేశాలిస్తూ ఈ వ్యవహారాన్ని నడిపింది ఓ మహిళ అని తెలిపింది. 
 
సుని మాటల్ని బట్టి అవతల ఉన్నది ఓ మహిళ అనే విషయం స్పష్టంగా అర్థమైందని భావన తెలిపింది. కానీ ఆ మహిళ ఎవరో తాను చెప్పలేకపోతున్నానని.. పోలీసులే ఆ విషయాన్ని బయటికి తీయాలని భావన పేర్కొంది. తనపై జరిగిన కుట్ర వెనుక చాలామంది పెద్దల హస్తం వుందని..  కేసును తాను తేలిగ్గా వదలనని.. ధైర్యంగా పోరాడుతానని భావన చెప్పుకొచ్చింది. అయితే భావన కిడ్నాప్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఆ మహిళ ఎవరా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్న మామ - కోడలు... చైతూ పరిస్థితేంటి?