తోటి టీవీ నటుడు, తునిషా శర్మ మాజీ ప్రియుడు షీజాన్ ఖాన్ తనను మతం మార్చమని ఒత్తిడి తెచ్చాడని మృతురాలి తల్లి శుక్రవారం ఆరోపించారు. "ఇది హత్య కూడా కావచ్చు... తునిషా మృతదేహాన్ని కిందకు దించే సమయంలో షీజాన్ అక్కడే ఉన్నాడు' అని తునిషా తల్లి వనిత ఆరోపించారు.
మరో మహిళతో చాట్ల గురించి అడిగినప్పుడు సెట్లో షీజాన్ ఖాన్ తునిషాను చెంపదెబ్బ కొట్టాడని, అతను అతని కుటుంబం తన కుమార్తెను వాడుకున్నారని తల్లి పేర్కొంది. అలీబాబా- దస్తాన్-ఇ-కాబూల్ టీవీ షో సెట్లలో శనివారం మరణించిన టీవీ నటి మరణానికి సంబంధించి పోలీసులు దాదాపు రెండు డజన్ల మంది వాంగ్మూలాలను నమోదు చేశారు.