కింగ్ ఖాన్ ... ఆ విషయంలో చాలా పూర్ బాసూ!!!
ప్రముఖ బాలీవుడ్ నటుడు కింగ్ ఖాన్ తన పదవ తరగతి మార్కుల జాబితా ఇప్పుడు ఇంటర్నెట్లో హలచల్ చేస్తుంది. ఈ మార్కుల జాబితాలో షారుఖ్ ఖాన్‌కు ఇంగ్లీషులో 51 మార్కులే వచ్చాయి. ఇదే ఇప్పుడు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది. ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తికి మిగిలిన సబ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు కింగ్ ఖాన్ తన పదవ తరగతి మార్కుల జాబితా ఇప్పుడు ఇంటర్నెట్లో హలచల్ చేస్తుంది. ఈ మార్కుల జాబితాలో షారుఖ్ ఖాన్‌కు ఇంగ్లీషులో 51 మార్కులే వచ్చాయి. ఇదే ఇప్పుడు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది. ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తికి మిగిలిన సబ్జెక్టులతో పోలిస్తే ఇంగ్లీష్‌లో చాలా తక్కువ మార్కులు రావడం అనే ఈ అంశం ఇప్పటికే మిశ్రమస్పందనతో ఇంటర్నెట్లో చక్కర్లుకొడుతోంది.
దీని ఆధారంగా ఇప్పుడు ఒక కొత్త అంశాన్ని చాలామంది యువకులు లేవనెత్తుతున్నారు. "జీవితంలో మార్కుల ప్రాముఖ్యత ఎంత?" అంటూ పలువురు ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో, "జీవితంలో ఏమి కావాలనే లక్ష్యం నిర్ణయించుకొన్న వారికి, దానికి అనుగుణంగా కష్టపడే వారికి మార్కులు అనేది ఆధారం కాదని" కొందరు విద్యార్థినీవిద్యార్థులు ఫేసుబుక్ పేజీలో ఇప్పటికే పోస్ట్ చేశారు.