Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

Advertiesment
shalini pandey

ఠాగూర్

, శనివారం, 12 ఏప్రియల్ 2025 (15:54 IST)
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం "అర్జున్ రెడ్డి". ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన భామ షాలిని పాండే. తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంటారని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు పెద్దగా హిట్ కాలేదు. దీంతో ఆమె స్టార్ రేంజ్‌ను సొంతం చేసుకోవడంలో వెనుకబడిపోయారు. ప్రస్తుతం హిందీ, తమిళంతో పాటు కొన్ని వెబ్ సిరీస్ చిత్రాల్లో నటిస్తున్నారు. 
 
తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను నటించాలని భావించే హీరో పేరును వెల్లడించారు. బాలీవుడ్ హీరో రణ‌బీర్ కపూర్‌తో కలిసి నటించాలనేది తన కోరిక అని షాలిని పాండే వెల్లడించారు. అతని కళ్ళలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుందని, నటనలో ఒక మాయ ఉంటుందని తెలిపారు. రణ‌బీర్‌తో కలిసి ఒక్క రోజైనా పని చేయాలనేది తన కోరిక అని చెప్పింది. ప్రతి సినిమాలో రణబీర్ నటనలో మార్పు కనిపిస్తుందని ఆమె కితాబిచ్చారు. 
 
విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష 
 
విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు - మీరు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది. ఖాళీగా కూర్చొని ఇతరులపై బురద జల్లడమే మీ పని అని హీరోయిన్ త్రిష అన్నారు. సామాజిక మాధ్యమాల్లో నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై నటి త్రిష అసహనం వ్యక్తం చేశారు. ఇంతటి విషపూరితమైన స్వభావంతో ఎలా ప్రశాంతంగా ఉంటున్నారని మండిపడ్డారు. ఇతరులపై బురద జల్లడమే వారి పని అని పేర్కొన్నారు. 
 
విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు. మీకు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది. ఖాళీగా కూర్చొని ఇతరులపై బురద జల్లడమే మీ పని. సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చి పోస్టులతో రాక్షసానందం పొందుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా భయమేస్తుంది. నిజం చెప్పాలంటే మీది పిరికితనం. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా అని త్రిష ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. 
 
కాగా, గతంలోనూ త్రిష ఈ విధంగా తప్పుడు కథనాలు వ్యాప్తి చేసే వారిపై సోషల్ మీడియా వేదికగా పోస్టుల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనీపాట లేని వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అప్పట్లో ధ్వజమెత్తారు. 
 
ఇక తాజాగా పోస్టు పెట్టడానికి కారణం.. ఆమె నటించిన "గుడ్ బ్యాడ్ అగ్లీ" మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలోని ఆమె పాత్రను కొంతమంది మెచ్చుకుంటే, మరికొంత మంది విమర్శించారు. ఆమె నటన ఏమీ బాగోలేదని, తమిళం తెలిసిన ఆమె తన పాత్రకు వేరే వారితో డబ్బింగ్  చెప్పించడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు త్రిష గురించి నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా స్పందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్