Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భిక్షగాడైన షకలక శంకర్.. జోలె పట్టి రోడ్లపై తిరుగుతూ.. ఏమైందంటే?

Advertiesment
భిక్షగాడైన షకలక శంకర్.. జోలె పట్టి రోడ్లపై తిరుగుతూ.. ఏమైందంటే?
, మంగళవారం, 6 అక్టోబరు 2020 (21:11 IST)
ఏమండి.. ఎలాగున్నారండి.. ఇలా కోస్తాంధ్ర భాషను సినిమాల్లో మాట్లాడుతూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు షకలక శంకర్. చాలా నేచురల్ నటించడం షకలక శంకర్‌కు ఉన్న అలవాటు. మనలో ఒక వ్యక్తిలా తెరపై కనిపిస్తాడు షకలక శంకర్. అందుకే చాలామంది అభిమానులకు చేరువయ్యాడు. 
 
సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. సినిమాల ద్వారా పెద్దగా సంపాదించకపోయినా మనస్సున్న వ్యక్తిగా పేరు సంపాదిస్తున్నాడు షకలక శంకర్. కరోనా సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలను గుర్తించారు షకలక శంకర్.
 
తన స్నేహితుల ద్వారా కొంత విరాళాలను సేకరించి వారికి సహాయం చేసే పనిలో పడ్డాడు. ముందుగా కరీంనగర్‌లో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేశాడు. నిరుపేదలను ఆదుకున్నాడు. కానీ ఆ విషయాన్ని ఎక్కడా చెప్పుకోలేదు. విజయవాడలో మాత్రం జోలె పట్టి భిక్షాటన చేశాడు. చేస్తున్నాడు.
 
రెండురోజుల పాటు విజయవాడలో భిక్షాటన చేస్తూ 15 నిరుపేద కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకెళ్ళాడు. కరోనా సమయంలో పోలీసులు తనకు సహకరిస్తున్నారని చాలా సంతోషంగా ఉందని.. చేసిన పనిని చెప్పుకోవడం తనకు ఇష్టం లేదంటున్నాడు శంకర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

400 Million viewsను సొంతం చేసుకున్న బుట్టబొమ్మ (Video)