Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండియన్ సినిమా అంటే బాహుబలి.. జక్కన్న సినిమాలో నటించాలనుంది: షారూఖ్

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ రాజమౌళి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బాహుబలి గురించి ఆ సినిమాలోని కట్టప్ప పాత్ర గురించి చేసిన కామెంట్స్ చేశారు. తన దృష్టిలో ఇండియన్ సినిమా అంటే 'బాహుబలి' అని అంటూ

Advertiesment
shahrukh khan
, ఆదివారం, 29 జనవరి 2017 (10:33 IST)
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ రాజమౌళి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బాహుబలి గురించి ఆ సినిమాలోని కట్టప్ప పాత్ర గురించి చేసిన కామెంట్స్ చేశారు. తన దృష్టిలో ఇండియన్ సినిమా అంటే 'బాహుబలి' అని అంటూ భవిష్యత్ భారతీయ సినిమాలకు 'బాహుబలి' ఒక రోడ్ మ్యాప్‌లా మారుతుంది అంటూ ఒక సంచలన కామెంట్స్ చేశాడు.
 
తాను 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమాలో నటిస్తున్న రోజులలో 'బాహుబలి' ప్రారంభమైందని.. తాను మూడు సినిమాలలో నటించినా ఇంకా 'బాహుబలి-2' నిర్మాణం జరుగుతూనే ఉన్న నేపథ్యాన్ని పేర్కొంటూ అలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలను తీయడం ఒక రాజమౌళికే కుదురుతుందని జక్కన్నను ఆకాశానికి ఎత్తేశాడు. అంతేకాదు అలాంటి సినిమాలలో నటించాలని తనకు కూడ కోరిక ఉందంటూ రాజమౌళికి గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు షారూఖ్ ఖాన్.
 
ఇదే సందర్భంలో తాను ముంబైలో ఉంటున్నా తెలుగు రాష్ట్ర ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటూ ఉంటానంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు షారూఖ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పెషల్ స్టేటస్ కోరుకోవడం మంచి విషయం అని చెపుతూ ప్రజలు ఎన్నో ఆశలతో కోరుకుంటున్న కోర్కెలను తీర్చడంలో ప్రభుత్వాలు ముందడుగు వేస్తే బాగుంటుందని తెలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను మళ్లీ నటించడానికి జయసుధ స్పూర్తి... మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్య