Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్త్రీలే నా జీవిత గమ్యం.. గమనం.. వారి వద్దే ఎంతో సౌకర్యం అంటున్న షారుఖ్

అతడు కింగ్ ఆఫ్ రొమన్స్‌గా పరిచితుడు. అతడు సెల్యులాయిడ్‌పై తేరిపార చూడనంత శిఖరస్థాయిని అనుభవిస్తున్నాడు. ప్రతి బాలివుడ్ నటికి అతడొక కలల రాజకుమారుడు. అందుకు తగ్గట్టే పురుషులతో గడపడం కంటే స్త్రీలతో గడపటంలోనే తనకెంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పేశాడు.

స్త్రీలే నా జీవిత గమ్యం.. గమనం.. వారి వద్దే ఎంతో సౌకర్యం అంటున్న షారుఖ్
హైదరాబాద్ , గురువారం, 19 జనవరి 2017 (03:39 IST)
అతడు కింగ్ ఆఫ్ రొమన్స్‌గా పరిచితుడు. అతడు సెల్యులాయిడ్‌పై తేరిపార చూడనంత శిఖరస్థాయిని అనుభవిస్తున్నాడు. ప్రతి బాలివుడ్ నటికి అతడొక కలల రాజకుమారుడు. అందుకు తగ్గట్టే పురుషులతో గడపడం కంటే స్త్రీలతో గడపటంలోనే తనకెంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పేశాడు. కానీ అతడు చెబుతున్నది రొమాన్స్ గురించి కాదు. తన జీవితంలో ప్రతిదశలోనూ కీలకపాత్ర పోషించింది మహిళలే అని అతడి అభిప్రాయం. వాస్తవజీవితంలోనూ, సినిమాల్లోనూ (కొత్తగా వస్తున్న రాయీస్ సినిమాతో సహా) మహిళలే తన కేంద్ర స్థానం అంటూ ఉద్వేగం ప్రకటించాడతడు. ఎవరో కాదు. బాలివుడ్ చిత్రపరిశ్రమ కలల రేడు షారూఖ్ ఖాన్.
 
తండ్రిని చిన్నతనంలోనే పోగొట్టుకున్న నాకు తల్లి విలువ, స్త్రీల గొప్పదనం ఏమిటో అందరికంటే మిన్నగా తెలుసంటూ షారుఖ్ ఖాన్ తన అంతరంగాన్ని పంచుకున్నారు. "తండ్రిని చిన్నతనంలోనే పోగొట్టుకున్నాను. అమ్మతోనే సాన్నిహిత్యం ఏర్పడింది. పిల్లలు తమ తల్లులతోటే సన్నిహితంగా ఉంటారని నా అంచనా. ఉత్సాహవంతురాలైన, వాస్తవికురాలైన, , సౌందర్యవంతురాలైన అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది. తల్లులందరూ ఇలాగే ఉంటారు కదా. నా జీవితాన్ని మొత్తంగా అమ్మే ప్రభావితం చేసింది. 13- 14 ఏళ్ల ప్రాయలో చాలావరకు నేను మహిళల వద్దే గడిపాను. అమ్మ కుటుంబంలో నేనొక్కడినే అబ్బాయిని. ఆమెకు నలుగురు సోదరిలు. వాళ్లకూ అబ్బాయిలు లేరు. ఆ విధంగా నేను వారి చుట్టూనే తిరుగుతుండేవాడిని. 
 
మా తాత కూడా త్వరగా చనిపోవడంతో బెంగుళూరులో మా అమ్మ కుటుంబంలో అందరూ మహిళలే ఉండేవారు. వాళ్లే నన్ను పెంచారు. వారి ఒళ్లోనే నేను పెరిగాను. జీవితంలో ఒకే ఒక తేడా ఏమింటే నేను బాయ్స్ హాస్టల్‌లో చేరాను. ఒకవైపు రోజంతా అబ్బాయిలనే చూసేవాడిని. ఇంటికి వస్తే అందరూ మహిళలే. వాళ్లే అక్కడ శక్తివంతులు. తదనంతర జీవితంలో పెళ్లయ్యాక, నాకు భార్య, కూతురు. ఇక్కడా మహిళలే. ఇలా అనేకమంది నా జీవితంలోకి ప్రవేశించారు. నిజం చెప్పాలంటే మహిళలతోటే నేనెంతో సంతోషంగా ఉండేవాడిని. వాళ్ల కంపెనీ అంటేనే నేనెంతో సంతోషించేవాడిని" అన్నారు షారుఖ్. 
 
సినీ జీవితంలోను నేను అందరికంటే రొమాంటిక్ హీరోని. అదేసమయంలో మహిళలంటేనే నాకెంతో సిగ్గు. వెండితెరపై కింగ్ ఆఫ్ రొమాన్స్‌నే కావచ్చు. కాని నిజజీవితంలో రొమాన్స్  విషయంలో నేను ఏమీ తెలీని పిల్లాడిని. ఒకరకంగా నిజజీవితంలో చేయలేనిది సెల్యులాయడ్‌పై చేసి చూపిస్తున్నానేమో. ప్రేమ కథల్లో నేను నటిస్తానని ఎన్నడూ భావించేవాడిని కాను. అలాంటిది రొమాంటికి దృశ్యాల్లో నేను నటించాల్సి వచ్చినప్పుడు విపరీతంగా సిగ్గుపడేవాడిని. అప్పుడు నాలో ఏర్పడే అసౌకర్యం నా హీరోయిన్లందరికీ తెలుసు. ఎంతో జాగ్రత్తలు తీసుకునేవాడిని. చిత్రాల్లో రొమాన్స్ చేయగలనేమో కానీ వాస్తవ జీవితంలో అస్సలు చేయలేను. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌందర్య లేదు... ఇప్పుడది ఊహించుకోలేను... బాలకృష్ణ