సీనియర్ నటుడు చలం అంటే తెలియనివారు ఎవ్వరూ లేరు. ఆంధ్రా దిలీప్ కుమార్ అనేవారు. హాస్యం, బాధ, తెలీనితనం ఆయన ముఖ కవళికలలో మెరుగుదిద్దేవారు. అలాంటి చలం తన యాభై మూడో ఏట చనిపోయారు. ఆయన అప్పట్లో విజయవాడలోని సీతమ్మ పేట జమీందార్ పాలించేవారు. వారి కుటుంబంలోని అమ్మాయినే చలంగారు వివాహం చేసుకున్నారు. అలనాటి చలం గారికి హీరీష్, రవిశంకర్ ఇద్దరుకుమారులున్నారు. అందులో కోరాడ రవిశంకర్. క్రికెటర్. రంజీ ట్రోీఫీకి ట్రైనీ కూడా వ్యవహరించారు.
ఓ సందర్భంలో తన తండ్రి గురించి రవిశంకర్ చెప్పిన మాటలు. నాన్నగారికి సినిమా అంటే ప్రాణం. రోజూ దినచర్య సినిమా నే. మార్నింగ్ ఎయిర్ పోర్ట్ కు కారులోకి వెళితే.. ఏ ఫ్లయిట్ వుంటే ఆ ఫ్లయిట్ లో వేరే ఊరు వెళ్ళి సినిమా చూసి వచ్చేవాడు. ఆయన తిరిగి వచ్చేవరకు డ్రైవర్ కారుతో అలానే వుండేవారు. మరీ బోర్ కొడితే.. రాజశ్రీ గారి లాంటివారిని తోడుగా తీసుకునని వెళ్ళేవారు.
నాన్నగారిని జీవితంలో సీరియస్ నెస్ నేను చూడలేదు. చాలా సరదగా వుంటారు. షూటింగ్ లేకపోతే వరండాలో కూర్చుని వచ్చేబోయేవారిని పలుకరించేవారు. లంబాడోళ్ళ రాందాసు సినిమా ఎండ్ లో నాన్నగారు చనిపోయారు. నాన్నగారు తన 18వ ఏటనే సినిమాల్లోకి వెళ్లారు. 'దాసి' సినిమాలో లక్ష్మీరాజ్యం తనయుడి పాత్రలో తెరపై కనిపించారు.
చలం గారు ఒక ట్రెండ్ సెట్టర్ అని రవిరాజా పినిశెట్టిగారు ఒక సందర్భంలో చెప్పారు. ఇక బాలూగారైతే ఒక కార్యక్రమంలో నన్ను స్టేజ్ పైకి పిలిచి, 'గాయకుడిగా తనకి జన్మనిచ్చింది కోదండపాణిగారైతే, గాయకుడిగా ఎదగడానికి నిచ్చెన వేసింది చలం గారు' అన్నారు. నాన్నగారు అని చెప్పుకోవడం గర్వంగా వుందని అన్నారు.
చెన్నైలో టీ నగర్ లో ఆపీసు వుండేది. రంగరాజపురంలో వుండేవాళ్ళం. జీవితంలో ఒక స్థాయికి వెళ్ళిన నాన్నగారు చివరి దశలో డిప్రెషన్ కు గురయి చనిపోయారని రవిశంకర్ వెల్లడించారు.