Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుండెపోటు తెప్పిస్తున్న బిగ్ బాస్.. కంట తడిపెట్టి పంపించేయమన్న సంపూర్ణేష్

ప్రముఖ టీవీ చానల్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో ప్రారంభంలో నెగటివ్ ప్రచారానికి గురైనా రోజులు గడిచే కొద్ది హిట్ టాక్ తెచ్చుకుంటోంది. కానీ తెలుగు సమాజానికి, తెలుగు వారికీ పూర్తిగా కొత్తదైన ఈ షో.. పాల్గొంట

గుండెపోటు తెప్పిస్తున్న బిగ్ బాస్.. కంట తడిపెట్టి పంపించేయమన్న సంపూర్ణేష్
హైదరాబాద్ , సోమవారం, 24 జులై 2017 (05:59 IST)
ప్రముఖ టీవీ చానల్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో ప్రారంభంలో నెగటివ్ ప్రచారానికి గురైనా రోజులు గడిచే కొద్ది హిట్ టాక్ తెచ్చుకుంటోంది. కానీ తెలుగు సమాజానికి, తెలుగు వారికీ పూర్తిగా కొత్తదైన ఈ షో.. పాల్గొంటున్నవారికి మాత్రం చుక్కలు చూపిస్తున్నట్లుంది. తమ తమ వృత్తి పనుల్లో భాగంగా పగటినిద్ర తప్పనిసరైన తెలుగు కళాకారులు, వినోద పరిశ్రమకు చెందినవారు ఈ షోలో పాల్గొంటూ పగటి నిద్రను ఆపుకోవడం చాలా కష్టంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పగటి పూట పూర్తిగా అలా పడి నిద్రపోతున్నాడన్న ఆరోపణతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబును షో కెప్టెన్‌ పదవినుంచి తీసివేయడంతోపాటు ఇలాగయితే ఎలిమినేట్ చేయవలసి ఉంటుందని బిగ్ బాస్ హెచ్చరికలు కూడా అందుకున్నారు. 
 
బిగ్ బాస్ నుంచి అలా హెచ్చరిక అందుకోవడం, కెప్టెన్‌ను ఉన్నట్లుండి తొలగించడంతో సంపూర్ణేష్ బాబు పూర్తిగా స్థైర్యం కోల్పోయిడని తెలిసింది.  టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’  షో ఏడో ఎపిసోడ్‌లో ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. తెలుగులో తొలి రియాల్టీ షో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన మరుసటి రెండు రోజుల్లో సంపూర్ణేష్ పూర్తిగా డీలాపడిపోయారు. కాస్త ఒత్తిడికి గురవడంతో ఏకంగా కంటతడి పెట్టుకున్నారు. ఓసారి ఛాతీలో కాస్త నొప్పిగా ఉందని తోటి సభ్యులకు చెప్పారు. మెడిసిన్ల వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆందోళన చెందారు. దీంతో 'బిగ్ బాస్'గారు నన్ను ఇంటికి పంపించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ విజ్ఞప్తి చేశారు. 
 
షోలో మరో సభ్యుడు ధన్‌రాజ్ చొరవ తీసుకుని సంపూర్ణేష్‌కు ధైర్యం చెప్పారు. టెన్షన్ పడవద్దని, అంతా మంచి జరుగుతుందని నచ్చజెప్పారు. ఒకవేశ నిజంగానే ఇంటికి వెళ్లాలని ఉంటే మాత్రం మరుసటి వారం అందరితో చెప్పి ఎలిమినేషన్‌లో సంపూ పేరు వచ్చేలా చేస్తామన్నారు. తగిన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని సంపూర్ణేష్‌కు 'బిగ్ బాస్' హామీ ఇవ్వడంతో ఆయన కాస్త కంట్రోల్ అయ్యారు.
 
మొత్తానికి ఒకటి మాత్రం నిజం. 70 రోజులు ఒకే చోట బంధించబడినట్లుగా జీవితం సాగించడం, తమ తమ అలవాట్లను తగ్గించుకుని నిర్బంధ జీవితం గడపటం అనుకున్నంత సులభం కాదని వారం రోజుల్లోపే తేలిపోయింది. ఇంకా ఎవరెవరికి గుండెపోట్లు వస్తాయో, ఎవరెవరికి నైతిక స్థయిర్యం దెబ్బతినిపోతుందో.. బిగ్ బాస్ నుంచి ఎవరు ఎన్ని అవమానాలకు గురి కావలసి వస్తుందో షోలో చూడాల్సిందే మరి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోయిన్‌గా ఉన్నానంటే కారణం ఆ గురువే.. తాను తీసిన సినిమాపై కామెంట్ చేస్తానా: తాప్సీ