Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొమ్మరిల్లు తర్వాత క్లాస్, మాస్ ఇద్దరినీ అలరిస్తున్న స్వచ్ఛమైన సినిమా ఫిదా.. ఆనందంలో యూనిట్

ఫిదా చిత్రం అందరి అంచనాలను తల్లకిందులో చేస్తు టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ పిక్చర్లలో ఒకటిగా రోజురోజుకూ అధిక ఆదరణ పొందుతోంది. ఎంతగా అంటే సినిమా జయాపజయాలను అంచనా వేయడంలో అత్యంత స్పష్టతతో ఉండే సినీ నిర్మాత దిల్ రాజు సైతం ఊహించనంత అద్భుత విజయాన్ని ఫిదా

బొమ్మరిల్లు తర్వాత క్లాస్, మాస్ ఇద్దరినీ అలరిస్తున్న స్వచ్ఛమైన సినిమా ఫిదా.. ఆనందంలో యూనిట్
హైదరాబాద్ , శుక్రవారం, 28 జులై 2017 (04:16 IST)
ఫిదా చిత్రం  అందరి అంచనాలను తల్లకిందులో చేస్తు టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ పిక్చర్లలో ఒకటిగా రోజురోజుకూ అధిక ఆదరణ పొందుతోంది. ఎంతగా అంటే సినిమా జయాపజయాలను అంచనా వేయడంలో అత్యంత స్పష్టతతో ఉండే సినీ నిర్మాత దిల్ రాజు సైతం ఊహించనంత అద్భుత విజయాన్ని ఫిదా సొంతం చేసుకోబోతోంది. లాభం గ్యారంటి అని మాత్రమే అనుకున్న ఈ సినిమా లాభాలను పక్కనబెట్టి విడుదలైన ప్రతిచోటా అందరి హృదయాలను కదిలించివేస్తోంది. 
 
ఫిదా దెబ్బకు ఫిదా అయిపోయిన దిల్ రాజు చిత్ర విజయం సంబరాలను ఏదో ఒక రోజు లేదా వారం రోజులు అని జరుపుకోవడం కాకుండా చిత్రం నడిచినన్ని రోజులూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట విజయ సంబరాలు జరుపుకుంటూనే ఉందామని ప్రకటించారు. ఈ లెక్కను చూస్తుంటే ఆంధ్ర, తెలంగాణ లోని అన్ని రీజియన్లలోనూ చిత్రయూనిట్ విజయోత్సవ సంబరాలను నిర్వహించనున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి ఆత్మగా నిలిచిన సాయి పల్లవి తెలుగు ప్రజలు తనను గుండెల్లో నిలుపుకుంటున్న తీరు చూసి ఫిదా అవుతోంది. జీవితానికి సరిపడా మధురానుభూతులను తనకు కల్పిస్తున్న తెలుగుప్రజలకు, ఇంతటి మంచి చిత్రంలో భానుమతి వంటి పాత్రను తనకిచ్చినందుకు నిర్మాతకు, శేఖర్ కమ్ములకు కృతజ్ఞతల మీద కృతజ్ఞతలు చెబుతోంది. తెలుగువారి మరో సావిత్రి అనేంతగా జనం నీరాజనాలు అందుకుంటోంది. గురువారం హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ సంబరాలు జరిపితే అక్కడా సాయిపల్లవే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలించింది. 
 
ఈ సందర్భంగా ఫిదా గురించి నిర్మాత, దర్శకులు, తదితరులు ఏమన్నారో చూద్దామా..
 
వరుణ్‌ తేజ , సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ‘ఫిదా’ ఈ నెల 21న విడుదలైంది. ఈ సందర్భంగా గురువారం ‘ఫిదా’ సంబరాలు’ నిర్వహించారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘‘‘శేఖర్‌ కమ్ముల సినిమా చాలా నేచురల్‌గా, పల్లెటూరి వాతావరణంలో ఉంటుంది. అతని సినిమాల్లో ఆ బ్రాండ్‌ ఉంటుంది’’ అని ప్రశంసించారు. సక్సెస్‌ రేషియో ఎక్కువ ఉన్నందుకు ఈర్ష్యతో రాజుగారికి కంగ్రాట్స్‌ చెబుతున్నా (నవ్వుతూ). అనిత (‘దిల్‌’ రాజు సతీమణి)గారి ఆశీర్వాదాలు ఉండటం వల్లే వరుస హిట్స్‌ వస్తున్నాయి. కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని నమ్మే తక్కువ మందిలో రాజు ఒకడు. వరుణ్‌ గత సినిమా ప్రివ్యూ చూసి ‘సారీ’ చెప్పా. ‘ఫిదా’ చూడగానే కంగ్రాట్స్‌ చెప్పా. వరుణ్‌ ఈ సినిమాలో చాలా నేచురల్‌గా చేశాడు. సాయి పల్లవి చాలా మంచి డ్యాన్సర్‌. బాగా నటించారు’’ అన్నారు. 
 
నటుడు–దర్శక–నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘మా గురువు దాసరి నారాయణరావు తర్వాత నన్ను ఆదరించిన వ్యక్తి అరవింద్‌గారు. అగ్ర నిర్మాతలంటే రామానాయుడు, విజయ బాపినీడు, అల్లు అరవింద్‌గారు. ‘దిల్‌’ రాజు తక్కువ వయసులో ఆ స్థాయికి చేరుకోవడం గ్రేట్‌. ‘మైఖేల్‌ జాక్సన్‌’ బయోపిక్‌ని అల్లు అర్జున్‌తో మీరు (అరవింద్, రాజు) తీయాలి. హృషికేష్‌ ముఖర్జీ, గుల్జార్‌ వంటి దర్శకులు ఇండియాలో రారేమో అనుకున్నా.. శేఖర్‌ కమ్ముల వచ్చారు. ‘పెళ్లిసందడి’ సినిమాను రాఘవేంద్రరావుగారు, ‘ఫిదా’ సినిమానుూ శేఖర్‌ కమ్ములనే తీయాలి. వీటిని  వేరే ఎవరు తీసినా ఫ్లాపే’’ అన్నారు. 
 
‘దిల్‌’రాజు మాట్లాడుతూ– ‘‘‘ఫిదా’ను ఆదరించిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పేందుకే ఈ సంబరాలు. ఇవి ఇంకా కొనసాగుతాయి. నా సినిమాల్లో నేను ఇన్‌వాల్వ్‌ అవుతుంటా. ‘ఫిదా’ అనుకున్నప్పుడు ఇది పక్కా శేఖర్‌ కమ్ముల ఫిల్మ్‌. మనం ఇన్‌వాల్వ్‌ అయితే ఈ సినిమా కిచిడీ అయిపోతుందని ఆయనకే అప్పజెప్పా. ‘ఫిదా’కి ‘దిల్‌’ రాజు జస్ట్‌ ప్రొడ్యూసర్‌. ఒక సినిమాకి రైట్‌ వేవ్‌లెన్త్‌ ఉంటే ఇలాంటి రిజల్ట్‌ వస్తుంది. మా సమష్టి కృషికి వచ్చిన మంచి రిజల్ట్‌ ఇది. చాలా గ్యాప్‌ తర్వాత మా బ్యానర్‌లో ‘బొమ్మరిల్లు’తో ‘ఫిదా’ని పోలుస్తున్నారు. ఇందులోని పాత్రలు హార్ట్‌కి టచ్‌ అయ్యాయి’’ అన్నారు. 
 
నాగబాబు మాట్లాడుతూ– ‘‘రాజుగారికి సినిమా అంటే ప్యాషన్‌.. ప్రేమ. డైరెక్టర్‌కి ఫ్రీడమ్‌ ఇస్తారు. మా అబ్బాయికి హిట్‌ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ‘మిస్సమ్మ’లో మహానటి సావిత్రి ఎంత బాగా చేసిందో భానుమతి పాత్రలో సాయిపల్లవి అంత గొప్పగా చేసింది. నాకు తెలిసి సావిత్రిగారి నిజమైన వారసురాలు సాయిపల్లవి. వరుణ్‌ చాలా నేచురల్‌గా చేశాడు. కొన్ని సినిమాలకెళితే గయ్యాళి పెళ్లాంతో విహారయాత్రకు వెళ్లినట్టుంటుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుంది వెళ్లిపోదామా అనిపిస్తుంది. కొన్ని సినిమాలకెళితే అందమైన గర్ల్‌ఫ్రెండ్‌తో విహారయాత్రకు వెళ్లినట్టుంటుంది. ‘ఫిదా’ సినిమాకెళితే ఒక మంచి గర్ల్‌ఫ్రెండ్‌తో టూర్‌ వెళ్లినట్టు ఉంటుంది’’ అన్నారు. 
 
‘‘ఈ సినిమాకు యూనిట్‌ బాడీ అయితే ఆత్మ తెలంగాణ. గుండె సాయిపల్లవి. నార్మల్‌ హిట్‌తో నేను హ్యాపీ అయ్యేవాణ్ణి కాదు. చాలా రోజులుగా డైరెక్టర్స్‌ లిస్ట్‌లో నా పేరు లేదు. అందుకే నా సినిమాతో సమాధానం చెప్పాలనుకున్నా. అది ‘ఫిదా’తో సాధ్యమైంది’’ అన్నారు  శేఖర్‌ కమ్ముల. వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ నా సినిమాకి సక్సెస్‌ మీట్‌ చేసుకోలేదు. చాలా సినిమాలు హిట్, ఫ్లాప్‌ అవుతుంటాయి. కొన్ని సినిమాలను ప్రేక్షకులు బాగా ఓన్‌ చేసుకుంటారు. అటువంటి చిత్రమే మా ‘ఫిదా’. భానుమతి పాత్ర లేకుండా ఫిదా సినిమా ఉండదు’’ అన్నారు. 
 
నటులు సాయిచంద్, ‘సత్యం’ రాజేష్, అరుణ్, శరణ్య, హీరోయిన్‌ సాయి పల్లవి, సంగీత దర్శకుడు శక్తీ కాంత్, పాటల రచయితలు సుద్దాల అశోక్‌తేజ, వనమాలి, చైతన్య పింగళి, ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ మీతో రెండోసారా...? నో చెప్పేసిన రకుల్ ప్రీత్ సింగ్... ఎవరికి?