Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమె పెద్ద అందగత్తె కాదే... కానీ సాయిపల్లవిలో ఏదో వుంది... అందుకే...

సాయి పల్లవి. గత నాలుగురోజుల ముందువరకు ఈ పేరు అస్సలు తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ హీరోయిన్ అంటే పడిచచ్చే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. వినూత్న దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో పరిచమయైన ఈ తమిళ భామ ప్రస్తుతం మంచి పేరును

Advertiesment
ఆమె పెద్ద అందగత్తె కాదే... కానీ సాయిపల్లవిలో ఏదో వుంది... అందుకే...
, సోమవారం, 24 జులై 2017 (12:54 IST)
సాయి పల్లవి. గత నాలుగురోజుల ముందువరకు ఈ పేరు అస్సలు తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ హీరోయిన్ అంటే పడిచచ్చే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. వినూత్న దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో పరిచమయైన ఈ తమిళ భామ ప్రస్తుతం మంచి పేరును సంపాదించుకుంది. పెద్దగా అందంగా లేకున్నా కేవలం తన అభినయంతోనే సాయిపల్లవి సినిమాల్లో నటించి ప్రేక్షకులను తనవైపు తిప్పుకుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 
 
తెలుగు స్పష్టంగా రాకున్నా భాషను నేర్చుకుని అందుకు తగ్గట్లుగా పల్లవి నటించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం పల్లెటూరి వాతావరణంలో నడిచే ఫిదా సినిమాలో  సాయిపల్లవి చేసిన నటనకు ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 
 
ప్రేక్షకులే కాదు ఎంతోమంది డైరెక్టర్లు, నిర్మాతలు కూడా పల్లవి నటకు ఫిదా అయ్యారంటే ఆమె నటన ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. సాయి పల్లవి నటనకు ఏకంగా పది సినిమాల్లో అవకాశం వచ్చిందట. తెలుగు, తమిళ బాషల్లో సాయిపల్లవికి అవకాశాలు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయిందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్ కేసు... చార్మీకి దడ పుడుతోందా? హైకోర్టును ఆశ్రయించిన నటి...