Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాహ్నవి బాయ్ ఫ్రెండ్‌తో సారా.. భుజంపై చేయేసుకుని ఫోజిచ్చింది.. రణ్‌వీర్ సింగ్‌తో సెల్ఫీ కూడా?

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి బాయ్ ఫ్రెండ్‌తో బిటౌన్ హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా సారా కూడ

జాహ్నవి బాయ్ ఫ్రెండ్‌తో సారా.. భుజంపై చేయేసుకుని ఫోజిచ్చింది.. రణ్‌వీర్ సింగ్‌తో సెల్ఫీ కూడా?
, మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (17:10 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి బాయ్ ఫ్రెండ్‌తో బిటౌన్ హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా సారా కూడా జాహ్నవి బాటలో పయనిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో ఓ వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు ఫ్రాంచైజీ యజమాని ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీలతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు హాజరయ్యారు.
 
ఈ పార్టీకి జాహ్నవి కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలసి వచ్చింది. అంతేకాదు, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా కూడా ఈ పార్టీలో మెరిసింది. ఈ సందర్భంగా జాహ్నవి బాయ్ ఫ్రెండ్ శిఖర్, సారా టెండూల్కర్‌లు ఒకరిపై మరొకరు చేతులు వేసుకుని, ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
webdunia
 
ఇదిలా ఉంటే.. సారా బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ కు వీరాభిమాని. అయితే ఆమెకు అతనిని కలుసుకునే అవకాశం ఇంతవరకు రాలేదు. ఈ మధ్య రణ్ వీర్ సింగ్‌ను కలిసిన సారా.. ఆతనితో సెల్ఫీ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు సచిన్ అభిమానులు, మరోవైపు రణ్ వీర్ సింగ్ అభిమానులు షేర్ చేసుకుంటున్నారు.
 
కాగా, సారా టెండూల్కర్ గతంలో సినిమాల్లో నటించనుందంటూ వార్తలు వెలువడగా, సచిన్ వాటిని ఖండించి, 'ఆమె చదువుకుంటోంది...సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు' అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సారా సినిమాల సంగతిని పక్కనబెడితే.. శిఖర్ పహారియా ఆమె భుజం చేయేసుకుని నిలబడి ఫోజులివ్వడం ఏమిటని సచిన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కానీ స్నేహితులు అలా భుజంపై చేయి వేసుకుని నిలబడటం మామూలేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివగామి పాత్ర కోసం ఎక్కడెక్కడో వెతికా.. సిగ్గుపడుతున్నా.. సారీ: రాజమౌళి