Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శరత్ కుమార్‌కు గుండెపోటు.. నడిగర్ సంఘం ఎన్నికలే కారణమా..?

తమిళ నటుడు శరత్ కుమార్‌కు ఉన్నట్టుండి గుండెనొప్పి రావడం కోలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది. నడిగర్ సంఘం ఎన్నికల్లో పరాజయం తర్వాత అటు సినిమాల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మంచి పట్టు రాకపోవడంతో ఇట

శరత్ కుమార్‌కు గుండెపోటు.. నడిగర్ సంఘం ఎన్నికలే కారణమా..?
, గురువారం, 23 జూన్ 2016 (13:10 IST)
తమిళ నటుడు శరత్ కుమార్‌కు ఉన్నట్టుండి గుండెనొప్పి రావడం కోలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది. నడిగర్ సంఘం ఎన్నికల్లో పరాజయం తర్వాత అటు సినిమాల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మంచి పట్టు రాకపోవడంతో ఇటు రాజకీయాల్లో కష్టాలను ఎదుర్కొంటున్న శరత్ కుమార్‌ను గురువారం గుండెనొప్పి వచ్చిందని ఆయన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి.
 
సమత్తువ మక్కల్ కట్చి అధినేత అయిన శరత్ కుమార్ నడిగర్ సంఘానికి కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో శరత్ కుమార్ విశాల్ జట్టు చేతిలో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరుచ్చెందూరులో డీఎంకే అభ్యర్థి అనితా రాధాకృష్ణన్ చేతిలో పరాజయం పాలైయ్యారు. దీంతో కొద్దిరోజులుగా మానసికంగా కుంగిపోయిన శరత్ కుమార్‌కు గురువారం ఉదయం గుండెనొప్పి వచ్చినట్లు.. హుటాహుటిన ఆయన్ని చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగచైతన్య నాకంటే చిన్నోడా...? సచిన్ టెండూల్కర్ చిన్నోడు కాదా అంటోందట సమంత...