Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాటల చిత్రీకరణ కోసం ఇటలీకి వెళుతున్న 'శరభ' యూనిట్

ఆకాష్ సహదేవ్, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎ.కె.యస్. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసోసియేట్‌గా వర్క్ చేసిన ఎన్.నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మాతగా రూ

Advertiesment
Sarabha unit
, బుధవారం, 14 సెప్టెంబరు 2016 (16:55 IST)
ఆకాష్ సహదేవ్, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎ.కె.యస్. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసోసియేట్‌గా వర్క్ చేసిన ఎన్.నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'శరభ'. జయప్రద, నెపోలియన్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సోషియో ఫాంట‌సీ బ్యాక్‌డ్రాప్‌లో హ్యుమ‌న్ ఏమోష‌న్స్‌తో పాటు హై టెక్నికల్ వాల్యూస్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 
 
ఈ సినిమాలో డ్యూయెట్ చిత్రీకరణ కోసం చిత్రయూనిట్ ఇటలీ వెళుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఆకాష్ సహదేవ్, సురేష్ కపాడియా మాట్లాడుతూ 'విజువల్ వండర్‌గా రూపొందుతోన్న శరభ మూవీ టాకీ పార్ట్ పూర్తయ్యింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపబోతున్నాం. భారీ బడ్జెట్‌తో క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా సినిమా రూపొందిస్తున్నాం. 
 
ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్‌ను ఇటలీలోని రోమ్ తదితర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరించడానికి ప్లాన్ చేశాం. అందులోభాగంగా సెప్టెంబర్ 25న యూనిట్ ఇటలీ వెళుతుంది. రఘు మాస్టర్ నేతృత్వంలో ఫారెన్ డ్యాన్సర్‌తో ఈ పాటను చిత్రీకరిస్తాం. అలాగే స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్ మౌంటెన్స్‌లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు వివరించారు. 
 
ఆకాష్ సహదేవ్, మిష్టీ చక్రవర్తి, నెపోలియన్, జయప్రద, నాజర్, షాయాజీ షిండే, పునీత్ ఇస్సార్, చరణ్ దీప్, ఎల్.బి.శ్రీరాం, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి, రఘుబాబు, 'జబర్దస్త్' రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రఫీ: రమణ సాల్వ, సంగీతం: కోటి, ఆర్ట్: కిరణ్ కుమార్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కో ప్రొడ్యూసర్: సురేష్ కపాడియా, నిర్మాత: అశ్వనీ కుమార్ సహదేవ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.నరసింహారావు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

య‌ధార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఆర్పీ పట్నాయక్ 'మన‌లో ఒక‌డు'