Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్ హీరోగా మరో కమెడియన్.. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' షూటింగ్ పూర్తి

టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం

Advertiesment
Saptagiri Express
, సోమవారం, 24 అక్టోబరు 2016 (17:14 IST)
టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై అత్యంత గ్రాండియర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
దాదాపు మూడు నెలలకి పైగా హైదరాబాద్, పోలాండ్‌లో ఈ సినిమా షూటింగ్ తాజాగా ముగిసింది. స్టార్ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ప్రత్యేక అకర్షణగా నిలుస్తోందని చిత్ర బృందం తెలిపింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌కి సోషల్ మీడియాలో విశేష ఆదరణ లభిస్తోంది. ఇదే ఊపుతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ముగించి త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత డాక్టర్ రవికిరణ్ తెలిపారు. 
 
అలానే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ టీమ్ త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, ఆడియో లాంఛ్ ఈవెంట్స్ జరుపుకోనుందని తెలిపారు. శివప్రసాద్‌, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, షాయాజీ షిండే, తులసి, షకలక శంకర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: గోపిని కరుణాకర్‌, ఆర్ట్‌: కుమార్‌, స్టంట్స్‌: జాషువా, డైలాగ్స్‌: రాజశేఖర్‌ రెడ్డి పులిచెర్ల, మ్యూజిక్‌: బుల్‌గానిన్‌, ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఆడిషనల్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే: ఎ సప్తగిరి ప్రాజెక్ట్‌, కో ప్రొడ్యూసర్‌: డా.వాణి రవికిరణ్‌. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుమన్ కీలక పాత్రలో యధార్ధ ఘటన ఆధారంగా 'ప్రేమభిక్ష'