Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రమాదానికి గురైన సంపూర్ణేష్.. ఆ ముగ్గురికి స్వల్పగాయాలు (video)

Advertiesment
sampoornesh babu
, బుధవారం, 27 నవంబరు 2019 (14:23 IST)
ప్రముఖ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ కారు ప్రమాదానికి గురైంది. సంపూర్ణేష్ బాబు కారును ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఆయనతో పాటు ఆయన భార్య, కుమార్తెకు గాయాలైనట్లు సమాచారం. సంపూర్ణేష్ బాబు తన కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, హుస్నాబాద్ డిపోకు చెందిన AP 22Z 0030 హుస్నాబాద్ డిపోకు చెందిన బస్సు వెనకనుండి ఢీకొట్టింది.
 
సంపూర్ణేష్ బాబు తను, తన కుటుంబ సభ్యులతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంపూర్ణేష్ బాబు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
కాగా.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మూడో చిత్రం ‘కొబ్బరి మట్ట’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంపూ మూడు విభిన్న పాత్రల్లో నటించారు. 
 
ఒకటి పాపారాయుడు, మరొకటి పెదరాయుడు కాగా.. ఇంకొకటి ఆండ్రాయిడు. ఇంకా ఈ సినిమాలో ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి సంపూ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఇందులో 3.27 నిమిషాల నిడివితో నాన్ స్టాప్ డైలాగ్ ఉంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్ కంటే అలీకి ఆయనంటే చాలా ఇష్టం.. ఎవరది?