Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేద మహిళకు రూ. 10,000 ఆర్థిక సాయం అందించిన సంపూర్ణేష్ బాబు

హృదయ కాలేయం చిత్రంతో తెలుగు ప్రేక్షకులందరినీ అలరించిన సంపూర్ణేష్ బాబు... పలు చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సంపూ. ఇటీవలే టీవీలో ఓ మహిళ గురించి

Advertiesment
పేద మహిళకు రూ. 10,000 ఆర్థిక సాయం అందించిన సంపూర్ణేష్ బాబు
, మంగళవారం, 27 డిశెంబరు 2016 (20:06 IST)
హృదయ కాలేయం చిత్రంతో తెలుగు ప్రేక్షకులందరినీ అలరించిన సంపూర్ణేష్ బాబు... పలు చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సంపూ. ఇటీవలే టీవీలో ఓ మహిళ గురించిన సమస్యను తెలుసుకొని స్పందించి తనవంతు సాయం అందించారు. 
 
వివరాల్లోకి వెళితే సిద్ధిపేట మండలం గాడిచర్ల పల్లి గ్రామంలో ఒక పేద మహిళ వ్యాధితో.... తోడు ఎవరూ లేక బాధ పడుతోంది. ఆమె గురించి టీవీలో వచ్చిన వార్తను చూసి సంపూర్ణేష్ బాబు స్పందించి 10,000 రూపాయల చెక్ అందించారు. స్వయంగా ఆమె ఉన్న ప్రాంతానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకొని సాయం అందించారు. ఆమె ఆర్థికంగా, మానసికంగా దీన స్థితిలో ఉండటంతో.... తనవంతుగా స్పందించానని... నాతో పాటు మరికొంతమంది కూడా స్పందిస్తే ఆ మహిళకు చేయూత అందించిన వారవుతారని సంపూర్ణేష్ బాబు ఈ సందర్భంగా కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోల మైండ్‌సెట్‌ మారుతోంది... 'ధృవ'తో రామ్ చరణ్ అదే చేశాడు...