'కత్తి'కి సంపూ అది పెట్టేశాడు... ఖుషీగా పవన్ ఫ్యాన్స్
కొంతమంది నటులు మాట్లాడితే చాలు మహా ఖుషీగా వుంటుంది. ఇప్పుడు నటుడు సంపూర్ణేష్ బాబు చేసిన వ్యాఖ్యలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహా ఖుషీ అయిపోతున్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే... ఈమధ్య పవన్ కళ్యాణ్ పైన కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే
కొంతమంది నటులు మాట్లాడితే చాలు మహా ఖుషీగా వుంటుంది. ఇప్పుడు నటుడు సంపూర్ణేష్ బాబు చేసిన వ్యాఖ్యలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహా ఖుషీ అయిపోతున్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే... ఈమధ్య పవన్ కళ్యాణ్ పైన కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే. అతడి వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
కొందరైతే చంపేస్తామంటూ బెదిరింపులు చేసినట్లు కత్తి ఆరోపించారు కూడా. ఐతే ఇప్పుడు పవన్ ను విమర్శించడంపై సంపూర్ణేష్ కూడా అసహనం ప్రదర్శించాడు. ఇన్ని కోట్లమంది మనసులు గెలుచుకున్న పవన్ కళ్యాణ్ ను విమర్శించడం కరెక్ట్ కాదంటూ చెప్పాడు.
మాట్లాడే స్వేచ్ఛ వున్నప్పటికీ ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నామో కాస్త చూసుకుని మాట్లాడాలని హితవు పలికాడు. సినిమా హీరోగానూ, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న నటుడిగా పవన్ కళ్యాణ్ ఎంతో ఉన్నతుడనీ, అలాంటి వ్యక్తిని ఎలాబడితే అలా మాట్లాడటం తనకు బాధ కలిగించిందని అన్నాడు సంపూ