Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''యూటర్న్'' తీసుకున్న సమంత: గ్లామర్ రోల్స్‌కు నో.. జర్నలిస్టుగా అవతారం!

Advertiesment
Samantha to play investigative journalist in U Turn remake
, గురువారం, 12 మే 2016 (16:00 IST)
దక్షిణాది హీరోయిన్‌గా అగ్రస్థానంలో ఉన్న సమంత కొత్త అవతారం ఎత్తనుంది. జర్నలిస్టు పాత్రలో అమ్మడు ప్రేక్షకులను మెప్పించనుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. హీరోయిన్‌గా ఇన్నాళ్లు అందాలు ఆరబోస్తూ గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకునే పనుల్లో పడింది. 
 
తెలుగులో ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సమంత ప్రస్తుతం బిజీ బిజీ అవకాశాలతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇటీవలే ‘24’తో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని పలకరించిన సమంత ప్రస్తుతం ‘అ ఆ, బ్రహ్మోత్సవం’ వంటి క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సమంత కొత్త సినిమా కోసం సంతకాలు చేసింది. 
 
కన్నడ థ్రిల్లర్‌ యూటర్న్ తెలుగు రీమేక్‌లో సమంత నటించనుందని... ఈ సినిమాలో సమంత జర్నలిస్టుగా కనిపిస్తుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. అంతేగాకుండా ఈ సినిమాను సమంతనే నిర్మిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేణు సూచనతో కాలేజీ విద్యార్థినికి ఫీజు చెల్లించిన పవన్‌... ఇద్దరూ ఒక్కటవుతారా?