Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి సంప్రదాయానికి మాత్రమే.. మా ఇద్దరికీ ఎప్పుడో వివాహమైంది: సమంత

అందాల తార, కొత్త పెళ్లి కుమార్తె సమంత వివాహానంతరం ఇంటర్వ్యూ ఇచ్చింది. తన వివాహం ప్రైవేటుగా జరగాలని ఎప్పుడో నిర్ణయించినట్లు తెలిపారు. మనకు బాగా కావాల్సిన వారిని ఆనందంగా ఉండేలా చూసుకోవడం తమ ఇద్దరికీ చాల

Advertiesment
Samantha Ruth prabhu
, బుధవారం, 11 అక్టోబరు 2017 (10:02 IST)
అందాల తార, కొత్త పెళ్లి కుమార్తె సమంత వివాహానంతరం ఇంటర్వ్యూ ఇచ్చింది. తన వివాహం ప్రైవేటుగా జరగాలని ఎప్పుడో నిర్ణయించినట్లు తెలిపారు. మనకు బాగా కావాల్సిన వారిని ఆనందంగా ఉండేలా చూసుకోవడం తమ ఇద్దరికీ చాలా ముఖ్యమని సమంత తెలిపింది. వివాహాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తే మనవారు ఎలా ఫీలవుతున్నారో మనకు తెలియదు. అలా జరగడం మా ఇద్దరికీ ఇష్టం లేదని సమంత చెప్పుకొచ్చింది.
 
అందుకే మా వివాహాన్ని పూర్తి ప్రైవేటు కార్యక్రమంగా గోవాలో చేసుకున్నామని వెల్లడించింది. కానీ గోవాలో పెళ్లి సంప్రదాయానికి మాత్రమేనని.. మా ఇద్దరికీ ఎప్పుడో వివాహమైపోయిందని తెలిపింది. తన కెరీర్ ఉత్సాహంగా సాగేకొద్దీ లక్ష్యాలు తగ్గుతూ వస్తాయని భావించానని, అయితే అలా జరగడం లేదని చెప్పింది. 
 
బ్యాంక్ బ్యాలెన్స్ సంగతి పక్కనపెడితే.. ఉత్తమంగా నటించాలని భావించానని, ఇంతవరకు అలా జరగలేదని సమంత చెప్పింది. అలా ఉత్తమ పాత్రల్లో నటించే దిశగా పయనిస్తున్నానని సమంత చెప్పుకొచ్చింది. ఇకపోతే.. సమంత రాజు గారి గది 2లో ఆత్మగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఓంకార్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం నాగార్జునతో పాటు సమంత పేర్లను నిర్మాతల్లో ఒకరైన నిరంజన్ సూచించారన్నారు.
 
మామ, కోడలు తమ కెరీర్‌లో హారర్ సినిమా చేయడం ఇదే తొలిసారని.. తన మనసుకు నచ్చిన కథలతోనే సమంత సినిమాలు చేస్తుండటంతో ఈ చిత్రాన్ని అంగీకరిస్తుందో లేదో అనుకున్నాను. కానీ కథ విన్న వెంటనే నటించడానికి ఒప్పుకుంది. ఆత్మ పాత్రలో ఆమె కనిపించనున్నది. సమంత తొలుత ఈ సినిమాలో నటిస్తున్నట్లు నాగార్జునకు తెలియదు. సమంత పాత్ర భావోద్వేగ ప్రధానంగా సాగుతుంది. పతాక ఘట్టాల్లో కన్నీళ్లను తెప్పిస్తుందని ఓంకార్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొనసాగుతోన్న 'జై లవ కుశ' జోరు.. 'శ్రీమంతుడు' రికార్డుకు చేరువలో....