Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వామ్మో... ఏంటి సమంతా ఇదీ? మరీ ఇంతా హాట్‌గానా?

టాలీవుడ్ ప్రేమ పక్షులు నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ 6,7 తేదీల్లో అట్టహాసంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు సమంత ఫోటో షూట్ అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే ఆమె హాటెస్ట్ మోతాదు చాలా ఎక్కువగా పెంచేసిన

Advertiesment
వామ్మో... ఏంటి సమంతా ఇదీ? మరీ ఇంతా హాట్‌గానా?
, మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (22:17 IST)
టాలీవుడ్ ప్రేమ పక్షులు నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ 6,7 తేదీల్లో అట్టహాసంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు సమంత ఫోటో షూట్ అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే ఆమె హాటెస్ట్ మోతాదు చాలా ఎక్కువగా పెంచేసినట్లు అనిపిస్తోంది. మరి ఈ ఘాటు ఫోటో షోట్ ఇప్పుడు అవసరమా అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు కొందరు.
 
ఇకపోతే సమంత-చైతుల వివాహం గోవాలో జరుగనుండగా, హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ జరుగనుంది. ఈ పెళ్లి వేడుకకు తాను ధరించే లెహంగా ఇదే అవుతుందేమోనని లెహంగా ధరించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. లేత చందనపు రంగులో వున్న లెహంగాలో సమంత లుక్ యమ హాటుగా వుంది.
 
ఇదే తన పెళ్లికి ధరించే లెహంగా అవుతుందనకుంటానని.. తాను ధరించిన ఈ లెహంగాను రూపొందించిన డిజైనర్ క్రేషా బజాన్‌ను సమంత ప్రశంసలతో ముంచెత్తింది. సమంత నిశ్చితార్థ వేడుకలో క్రేషా డిజైన్ చేసిన చీరనే ధరించింది.
webdunia
 
ఈ చీరలో అక్కినేని నాగచైతన్యతో తనకున్న ప్రేమాయణం సంబంధించిన జ్ఞాపకాలను అందులో ప్రింట్ చేయించింది. ప్రస్తుతం అదే రంగులో క్రేషా రూపొందించిన లెహంగాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలను మీరూ చూడండి..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ చిత్రం పేరు ఇదే...