Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధనుష్ నా కాపురాన్ని నిలబెట్టాలనుకున్నాడు.. దుష్ప్రచారం చేయడం నీచం: అమలా పాల్

అమలాపాల్-విజయ్ విడాకులకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ కారణమంటూ తమిళ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమలకు, ధనుష్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వివాహా

Advertiesment
Samantha-Dhanush behind Vijay-Amala split: Amala Paul fired
, శుక్రవారం, 30 డిశెంబరు 2016 (12:38 IST)
అమలాపాల్-విజయ్ విడాకులకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ కారణమంటూ తమిళ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమలకు, ధనుష్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వివాహానికి పూర్వం, విడాకుల తర్వాత వరుసబెట్టి ధనుష్‌ సినిమాల్లో అవకాశాలు అందుకోవడంతో ఈ డౌట్ మరింత ఎక్కువైంది. 
 
ప్రస్తుతం ధనుష్ సారథ్యంలో ''వీఐపీ-2''లో అమలను తీసుకోవద్దని ధనుష్‌ను కోరిందట ఆమె మాజీ భర్త కుటుంబం. కానీ, ధనుష్‌ వారిని లెక్కచేయకుండా అమలకే ఛాన్సిచ్చాడని వస్తున్న వార్తలపై అమలాపాల్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. 
 
ఇలా ఓ పెళ్లైన వ్యక్తి గురించి దుష్ప్రచారం చేయడం చాలా నీచమని విరుచుకుపడింది. ధనుష్‌ తన శ్రేయోభిలాషి అని, తన కాపురాన్ని నిలబెట్టడానికి కూడా ప్రయత్నించాడని చెప్పింది. అలాంటి వ్యక్తితో తన పేరును ముడిపెడుతూ.. వార్తలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌తో మోహన్‌లాల్‌... కాటమరాయుడు చిత్రం తర్వాత...