Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డార్లింగ్ వదినకు హ్యాపీ బర్త్‌డే: సమంతకు అఖిల్ వెరైటీ విషెస్

పుట్టినరోజున నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురిలో ఒక్కరు కూడా అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టనున్న సమంతకు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ చెప్పకపోవడంతో అనుమానాలు చెలరేగాయి కానీ అఖిల్ కొత్త అక్కినేనితో నేను.. అంటూ ఫోటో దిగి డార్లింగ్ వదినకు హ్యాపీ

Advertiesment
డార్లింగ్ వదినకు హ్యాపీ బర్త్‌డే: సమంతకు అఖిల్ వెరైటీ విషెస్
హైదరాబాద్ , ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (07:13 IST)
బ్యాచిలర్‌గా శుక్రవారం చివరి బర్త్‌డే జరుపుకున్న సమంతకు మరిది అఖిల్ వెరైటీగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. సాధారణంగా జీవితంలోని ముఖ్యమైన తేదీలను కాబోయే జీవన సహచరుడు నాగచైతన్యతో కలిపి సెలబ్రేట్ చేసుకోవడం సమంతకు అలవాటు కాగా ఈ శుక్రవారం మాత్రం సమంత నుంచి అలాంటి వార్త రాలేదు. ఏదైనా విశేషం జరిగితే వెంటనే ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తప్పనిసరిగా చేసే సమంత తన పుట్టిన రోజు పూర్తిగా సైలెంట్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. 
 
అలాగని ఆమె బర్త్ డే జరుపుకోలేదని కాదు. శుక్రవారం సాయంత్రం అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో సమంత స్పెషల్‌గా బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకున్నారు. కాబోయే వదినతో దిగిన బర్త్‌డే ఫొటోలను అఖిల్‌ ట్వీట్‌ చేసి, విషెస్‌ చెప్పారు. ‘‘కొత్త అక్కినేనితో నేను. డార్లింగ్‌ వదినకు హ్యాపీ బర్త్‌డే. ఈ ఏడాది నీకు అంతా మంచే జరుగుతుంది’’ అని అఖిల్‌ ట్వీట్ చేశాడు. 
 
చైతూతో పెళ్లి ఫిక్స్‌ అయ్యింది కదా! కాబట్టి సమంతకు బ్యాచిలర్‌గా ఇదే చివరి బర్త్‌డే కావొచ్చు.  అయితే పుట్టినరోజున నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురిలో ఒక్కరు కూడా అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టనున్న సమంతకు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ చెప్పకపోవడంతో అనుమానాలు చెలరేగాయి కానీ అఖిల్ కొత్త అక్కినేనితో నేను.. అంటూ ఫోటో దిగి డార్లింగ్ వదినకు హ్యాపీ బర్త్ డే చెప్పడంతో అంతా కూల్ అయ్యారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ల్మ్ రికార్డులు మటాష్... ఫస్డ్ డే రూ.100 కోట్లు : నెంబర్లు పట్టేలా స్పేస్ కావాలి.. కరణ్ జొహార్