నా ఎత్తుతో ఇక్కడి వారికేమీ ఇబ్బంది ఉండదు... సాక్షిచౌదరి
ఆరడగుల ఎత్తు వుండే సాక్షిచౌదరి.. నటిగా తెలుగులో హీరోలతో చేయడం కాస్త ఇబ్బంది అనేది పెద్ద సమస్య కాదని.. తెలుగులో వెంటనే అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు వెళ్ళినట్లు చెబుతోంది. అల్లరి నరేష్‌తో 'జేమ్స్‌బాండ్' తర్వాత నటిస్తున్న చిత్రమిది. నటన నచ్చే తనక
ఆరడగుల ఎత్తు వుండే సాక్షిచౌదరి.. నటిగా తెలుగులో హీరోలతో చేయడం కాస్త ఇబ్బంది అనేది పెద్ద సమస్య కాదని.. తెలుగులో వెంటనే అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు వెళ్ళినట్లు చెబుతోంది. అల్లరి నరేష్‌తో 'జేమ్స్‌బాండ్' తర్వాత నటిస్తున్న చిత్రమిది. నటన నచ్చే తనకు రెండో అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
బాలీవుడ్‌కు చెందిన నటీమణుల నటనాకాలం తక్కువ కావడానికి అదృష్టం కూడా కలిసిరావాలని.. అయినా.. వచ్చేవరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సాఫ్ట్‌గా వుండే పాత్రలో తాను నటించానని చెప్పారు. 'సెల్పీ'ని ఎక్కువ తీసుకోననీ.. ఈ చిత్రం షూటింగ్ సమయంలో చాలాసార్లు ప్రముఖులతో సెల్ఫీ తీసుకున్నానని అన్నారు. నరేష్ కామెడీలో మంచి టైమింగ్ వున్న నటుడని కితాబిచ్చారు.