ఫిదా సినిమా తర్వాత సాయి పల్లవి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేసింది. స్కిన్ షో కు మొదటి నుండి కూడా దూరంగా ఉండే సాయి పల్లవి పద్దతిగా కనిపిస్తూ అందరి మన్ననలు పొందుతోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఐటెం సాంగ్‌లో చేసే అవకాశం వస్తే చేస్తారా అంటూ ప్రశ్నించగా అందుకు నిర్మొహమాటంగా నో చెప్పేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది. కోట్లు ఇచ్చినా అలాంటి పాత్రలు చేయనంటూ స్పష్టం చేసింది.
తాను ఐటెం సాంగ్‌ను చేయాలని అస్సలు అనుకోవడం లేదు. ఎందుకంటే తనకు ఐటెం సాంగ్స్‌లో వేసుకునే కాస్ట్యూమ్స్ అస్సలు నచ్చవు. స్కిన్ షో చేయడం అంటే తనకు అస్సలు ఇష్టం లేదని సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది. అలాంటి డ్రస్‌ల్లో జనాలు కాదు తనను తాను చూసుకోలేనని చెప్పింది.
అందుకే తాను ఐటెం సాంగ్స్ చేయనంది. ఐటెం సాంగ్స్ మాత్రమే కాదు కాస్త స్కిన్ షో ఉన్న సినిమాలను కూడా చేయనంటూ సాయి పల్లవి వ్యాఖ్యలు చేసింది.