Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిగ్గు ప‌డిన సాయిధ‌న్సిక ఎందుకంటే..!

Advertiesment
Saidhansika,
, సోమవారం, 27 జూన్ 2022 (10:09 IST)
Saidhansika,
తెలుగు సినిమాల్లో హీరోయిన్లుగా బాలీవుడ్‌, ఇత‌ర వుడ్‌ల‌నుంచి వ‌స్తున్నారు. తెలుగువారు పెద్ద‌గాలేరు. అందుకే దాస‌రి నారాయ‌ణ‌రావుగారు బ‌తికున్నంత‌కాలం ఇక్క‌డి హీరోయిన్ల‌ను తీసుకోండ‌య్యా! అని మొత్తుకునేవారు. ముంబై నుంచి ఇత‌ర భాష‌ల‌నుంచి తీసుకువ‌చ్చి వారికి హైప్ క్రియేట్ చేశాక మొహం చూపించ‌రి అనేవారు. అందుకే సాయిధ‌న్సిక‌నుచూసి సిగ్గుతెచ్చుకోండ‌ని మిగ‌తా హీరోయిన్ల‌కు నిర్మాత‌, ఛాంబ‌ర్ కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న‌కుమార్ తెలియ‌జేస్తున్నారు.
 
మ‌గాళ్ళు సినిమా ప‌బ్లిసిటీకి వ‌స్తారు. కానీ హీరోయిన్లు రారు. ఇక్క‌డ సినిమా చేశామా! డ‌బ్బులు తీసుకున్నామా! ఆ త‌ర్వాత మ‌రో సినిమా కోసం బుక్ చేసుకున్నామా! ఇదే ఆలోచిస్తారు. ఇలాంటి జోన‌ర్‌లో ఆలోచిస్తుంటే దాస‌రిగారు అలాంటి హీరోయిన్లు వ‌ద్ద‌నే వారు. మ‌రి ఆయ‌న మాట‌లు సాయిధ‌న్సిక విన్న‌దేమో, పైనుంచి ఆయ‌న దీవెన‌లు వున్నాయెమోకానీ.. సాయిధ‌న్సిక పబ్లిసిటీకి స‌హ‌క‌రించింది. ర‌జనీకాంత్ న‌టించిన క‌బాలి ద్వారాఅంద‌రికీ తెలిసిన సాయిధ‌న్సిక తెలుగులో ప్ర‌ధాన పాత్ర పోషిస్తూ షికారు సినిమా చేసింది.  ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం వైజాగ్ నుంచి నెల్లూరువ‌ర‌కు రోడ్ ట్రిప్‌లో పాల్గొంది. ఈ విష‌యం తెలిసిన ప్ర‌స‌న్న‌కుమార్ స్పందించారు. ఇక‌నైనా మిగిలిన ఆడాళ్ళు (హీరోయిన్లు) సిగ్గుతెచ్చుకొని ప‌నిచేయండి అంటూ షికారు ప్ర‌మోష‌న్‌లో భాగంగా మాట్లాడారు. ఆయ‌న మాట‌ల‌కు అక్క‌డున్న నిర్మాత‌లంతా క‌ర‌తాళ‌ద్వ‌నులు చేశారు.అక్క‌డున్న ఆమె నిజంగానే సిగ్గుప‌డుతూ.. ఇంత ఆద‌ర‌ణ తెలుగులో చూపిస్తార‌నుకోలేదంటూ రియాక్ట్ అయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్ర‌భాస్‌, అనుష్క కాంబినేషన్‌ను సెట్ చేస్తున్న ద‌ర్శ‌కుడు!