Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ భావనకు జీవం పోస్తున్న సాయి పల్లవికి వెల్లువలా అవకాశాలు

కేరళ యువతరానికి ప్రేమకు సంబంధించిన నిర్వచనాన్ని సరికొత్తగా నేర్పిన అద్భుత పాత్ర మలర్. ప్రేమమ్ సినిమాలో ఆ పాత్ర పోషించినది సాయిపల్లవి. మలయాళం చిత్రం ప్రేమమ్‌ చూసిన వారికి సాయిపల్లవి గురించి ప్రత్కేకంగా చెప్పనక్కర్లేదు. అందులో మలర్‌ టీచర్‌ పాత్రలో సాయి

ప్రేమ భావనకు జీవం పోస్తున్న సాయి పల్లవికి వెల్లువలా అవకాశాలు
హైదరాబాద్ , శుక్రవారం, 20 జనవరి 2017 (05:05 IST)
తమిళ తెరకు నటి సాయిపల్లవి కొత్త కావచ్చు కానీ, ఈ మలయాళీ భామ పేరు మాత్రం ఇక్కడా పాపులరే. కేరళ యువతరానికి ప్రేమకు సంబంధించిన నిర్వచనాన్ని సరికొత్తగా నేర్పిన అద్భుత పాత్ర మలర్. ప్రేమమ్ సినిమాలో ఆ పాత్ర పోషించినది సాయిపల్లవి. మలయాళం చిత్రం ప్రేమమ్‌ చూసిన వారికి సాయిపల్లవి గురించి ప్రత్కేకంగా చెప్పనక్కర్లేదు. అందులో మలర్‌ టీచర్‌ పాత్రలో సాయిపల్లవి అంతగా ఇమిడిపోయి నటించారు. నటనానుభవం గతంలో ఏమీ లేనప్పటికీ, సున్నితమైన భావాలను కళ్లతో, తన కదలికలతో ప్రకటించి యువతరానికి పాజిటివ్ ప్రేమ మహత్తును రుచిచూపి మలయాళ విద్యార్థినీ విద్యార్థులను పిచ్చెత్తించిన పాత్ర మలర్. కేరళలో ప్రతి ఇంటి తలుపును తట్ట లేపిన మలర్ పాత్రకు సాయిపల్లవి జీవం పోసింది.
 
ఆ ఒక్క పాత్ర ఆమెకు దక్షిణాది సినిమాలన్నింట్లోనూ అవకాశాలను కొని తెచ్చిపెట్టింది. తమిళంలో ఆమెను కార్తీ, విక్రమ్ సరసన నటింపచేయాలనే ప్రయత్నాలు గతంలోనే జరిగినా అవి ఫలించలేదు. తాజాగా సాయిపల్లవి కోలీవుడ్‌ ఎంట్రీ ఖరారైంది. అమ్మాయి మడ్డీ అని ముద్దుగా పిలుచుకునే నటుడు మాధవన్ కు జంటగా నటించడానికి ఈ బ్యూటీ సిద్ధం అవుతున్నారు. ఇరుదు చుట్రు చిత్రం తరువాత మాధవన్ చిత్రం ఏదీ రాలేదు. ఒకటి రెండు చిత్రాలు కమిట్‌ అయిన మాధవన్  నటించనున్న తాజా చిత్రం ఇదే అవుతుంది. 
 
దీనికి విజయ్‌ దర్శకత్వం వహించనున్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాలను హ్యాండిల్‌ చేసే ఈయన దేవి చిత్రం తరువాత మలయాళ సక్సెస్‌ఫుల్‌ చిత్రం చార్లీని రీమేక్‌ రెడీ అయ్యారు. ఈ రొమాంటిక్‌ ప్రేమ కథా చిత్రంలో మాధవన్, సాయిపల్లవి రొమాన్స్ చేయనున్నారు. దీని గురించి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శ్రుతి నల్లప్ప తెలుపుతూ మలయాళ చిత్రం చార్లీని తమిళ నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు. సాయిపల్లవిని ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు.
 
శేఖర్ కమ్ముల తీస్తున్న ఫిదా చిత్రం ద్వారా సాయి పల్లవి తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టడం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎటిఎంలో రొమాన్స్‌... జనం డబ్బు కోసం ఏటీఎంలకు రావడంలేదనీ....