Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

`మేజర్‌` కోసం స్కూల్ యూనిఫామ్‌లో సాయి మంజ్రేకర్

Advertiesment
Sai Manjrekar
, శనివారం, 3 ఏప్రియల్ 2021 (18:17 IST)
Sai Manjrekar, Adavi sesh
మేజ‌ర్ చిత్రంలోని క్యారెక్టర్ పోస్టర్‌లో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్‌, అడివి శేష్ ల మ‌ధ్య సారూప్యతలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. శ‌నివారం ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న న‌టి ‌సాయి మంజ్రేకర్ ఫ‌స్ట్ గ్లిమ్స్‌ని విడుద‌ల‌చేసిన చిత్ర యూనిట్‌. మేజ‌ర్ మూవీ టీజ‌ర్‌ను ఏప్రిల్ 12న ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు మేకర్స్‌. 
 
ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్ యూనిఫామ్‌లో సాయి మంజ్రేకర్ మరియు ఆడివి శేష్ ఉన్న ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. అలాగే డిఫెన్స్ అకాడమికి సెల‌క్ట్ అయినందుకు లెట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం ఈ పోస్ట‌ర్లో చూపించారు. 
 
టీనేజ్ నుండి యుక్తవయసు వరకు వైవిధ్యమైన దశలలో  అడివి శేష్‌తో పాటు సాయి మంజ్రేకర్ పాత్ర మ‌న‌కి క‌నిపిస్తోంది. తొలి చిత్రం 'దబాంగ్ 3' తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తరువాత సాయి మంజ్రేకర్ తెలుగులో న‌టిస్తోన్న మొద‌టి చిత్ర‌మిది.
 
26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కుతోంది. శౌర్యం మరియు ధైర్యానికి పేరుగాంచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చనిపోయిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించి మేజర్ సందీప్ జీవితాన్నిసెల‌బ్రేట్ చేయ‌డ‌మే ఈ చిత్ర ముఖ్య ఉద్దేశం.
 
తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జులై2 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కాబోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త‌ప్పూ ఒప్పులు లేవు. అధికారం మాత్ర‌మే శాశ్వ‌తం అంటోన్న ర‌మ్య‌కృష్ణ‌