జవానుగా సెప్టెంబర్ 1న వస్తోన్న సాయి ధరమ్ తేజ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. దర్శకుడు బీవీఎస్ రవి రూపొందించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానున్నట్లు సినీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలోని సాయిధరమ్ తేజ్, మెహరీ
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. దర్శకుడు బీవీఎస్ రవి రూపొందించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానున్నట్లు సినీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలోని సాయిధరమ్ తేజ్, మెహరీన్‌ల పలు పోస్టర్‌లను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. 'ఇంటికొక్కడు' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమాలో హీరో కుటుంబానికి ప్రాధాన్యతనిస్తాడా? లేక దేశానికి ప్రాధాన్యతనిస్తాడా? అనే అంశంతో కథ సాగుతుంది.
దసరా సీజన్లో బడా హీరోలు బరిలో దిగుతుండటంతో కాస్త ముందుగానే జవాన్ థియేటర్లలో సందడి చేయనున్నాడు. త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది జవాన్ యూనిట్. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల కానుంది.