Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనం పెట్టిన డబ్బుకి హ్యాపీగా ఫీలయితే అదే మాకు కోటి వరహాలు: సాయిధరమ్

చేస్తున్న ప్రతి సినిమాలనూ ఓ కొత్తదనం. ఓ వైవిధ్యం, ప్రేక్షకుడి కంటికి ఫీస్టు. వెరసి అతడి ఒక విందుభోజనం. చిత్రరంగంలోకి అడుగుపెట్టి అతి తక్కువకాలమే అయినప్పటికీ ఇతరులు తేరిపార చూడలేనంత ఎత్తుకు ఎదిగిపోయిన వర్థమాన నటుడు సాయి ధరమ్. మెగా ఫ్యామిలీ వారసత్వంతో

Advertiesment
Winner
హైదరాబాద్ , బుధవారం, 1 మార్చి 2017 (07:01 IST)
చేస్తున్న ప్రతి సినిమాలనూ ఓ కొత్తదనం. ఓ వైవిధ్యం, ప్రేక్షకుడి కంటికి ఫీస్టు. వెరసి అతడి ఒక విందుభోజనం. చిత్రరంగంలోకి అడుగుపెట్టి అతి తక్కువకాలమే అయినప్పటికీ ఇతరులు తేరిపార చూడలేనంత ఎత్తుకు ఎదిగిపోయిన వర్థమాన నటుడు సాయి ధరమ్. మెగా ఫ్యామిలీ వారసత్వంతో పనిలేకుండా తమ స్వంత ప్రతిభను, నటనను నమ్ముకుని సినీ సముద్రంలో ఈదుతున్న నవతార ఇతడు. హీరోయిజం పట్ల కాకుండా కథపట్లే గౌరవం వెట్టి దర్శకుడి చేతిలో దర్సకత్వాన్ని పెట్టి నింపాదిగా నటనకు పరిమితమయ్యే ధరమ్ తక్కువ కాలంలోనే ఎక్కువ మెచ్యూరిటీ కూడిన మాటలు మాట్లాడటం ముదావహం. అదేంటే తన మాటల్లోనే చూద్దాం.
 
‘‘ప్రతి కమర్షియల్‌ సినిమాలోనూ హీరో ఇంట్రడక్షన్‌ ఫైట్, సాంగ్, తర్వాత సీన్స్‌.. అన్నీ కామన్‌. కొత్తగా ఏం ఉండదు. కానీ, ప్రేక్షకుల్ని మెప్పించేలా ఎలా చూపించగలమనేది మా చేతుల్లో ఉంది. నేను కథ విన్నప్పుడు జనాలు యాక్సెప్ట్‌ చేస్తారా వాళ్లు పెట్టిన డబ్బుకి హ్యాపీగా ఫీలవుతారా లేదా అని ఆలోచిస్తా’’ అన్నారు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు నిర్మించిన ‘విన్నర్‌’ గత నెల 24న విడుదలైంది. సాయిధరమ్‌ చెప్పిన సంగతులు...
 
కథ చెప్పినప్పుడు తండ్రీకొడుకుల సెంటిమెంట్, హార్స్‌ జాకీ బ్యాక్‌డ్రాప్‌ కొత్తగా అనిపించాయి. కానీ, నేను చేయగలనా లేదా అని భయపడ్డా. మా దర్శకుడు, ఫైట్‌ మాస్టర్‌ కలయాన్‌ ఇచ్చిన ధైర్యంతో చేశా. చిత్రీకరణలో గుర్రం మీద నుంచి నాలుగుసార్లు కింద పడ్డాను. ఓ గంట విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్‌ చేసేవాణ్ణి. కింద పడిన ప్రతిసారీ అమ్మ గుర్తొచ్చేది. నేను ఊహించినట్టు జేబీ (జగపతిబాబు) గారితో నటించిన సీన్లకు మంచి స్పందన వస్తోంది. ఫ్యామిలీ ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది.
 
వసూళ్లు, రికార్డుల గురించి పెద్దగా ఆలోచించను. నా పనేంటి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేశామా, నిర్మాతలు హ్యాపీగా ఉన్నారా అనేంత వరకే. హీరోగా నా రేంజ్‌ గురించి పట్టించుకోను. రేంజ్, స్టార్‌డమ్‌ అనేవి ప్రేక్షకులు ఇవ్వాలి. ‘విన్నర్‌’ విడుదల తర్వాత మా నిర్మాతలు హ్యాపీ. ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు కాబట్టే ఇంత మాట్లాడగలుగుతున్నా. లేనిదాన్ని సృష్టించి చెప్పను కదా.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోయిన్లు ఈర్ష్యతో రగిలిపోతుంటారా.. ఉత్తి గ్యాస్ అన్న తమన్నా