Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరుణ్ తేజ్ అంత సంస్కారవంతుడిని నేనెక్కడా చూడలేదు: సాయిచంద్

ఫిదా సినిమాలో సాయి పల్లవి, రేణుకల తండ్రి పాత్రలో జీవించి ప్రేక్షకుల కంట తడి పెట్టించిన అలనాటి ప్రముఖ హీరో, మాభూమి చిత్రం కథానాయకుడు సాయిచంద్ ఫిదా హీరో వరుణ్ తేజ్ గుణగుణాలను మీడియాతో పంచుకున్నారు. నేటి సినిమా ప్రపంచంలో వరుణ్ అంత సంస్కారవంతుడిని తానెక

వరుణ్ తేజ్ అంత సంస్కారవంతుడిని  నేనెక్కడా చూడలేదు: సాయిచంద్
హైదరాబాద్ , శుక్రవారం, 4 ఆగస్టు 2017 (08:44 IST)
ఫిదా సినిమాలో సాయి పల్లవి, రేణుకల తండ్రి పాత్రలో జీవించి ప్రేక్షకుల కంట తడి పెట్టించిన  అలనాటి ప్రముఖ హీరో, మాభూమి చిత్రం కథానాయకుడు సాయిచంద్ ఫిదా హీరో వరుణ్ తేజ్ గుణగుణాలను మీడియాతో పంచుకున్నారు. నేటి సినిమా ప్రపంచంలో వరుణ్ అంత సంస్కారవంతుడిని తానెక్కడా చూడలేదని చెప్పారు. చిరంజీవి కుటుంబంతో తనకున్న పరిచయాలతో చిన్నప్పటినుంచే వరుణ్, తన చెల్లెలు నీహారిక గురించి తెలుసునని జూబ్లీ హిల్స్ క్లబ్‌కి వాళ్లు నాన్న నాగబాబుతోపాటు వచ్చేవారని సాయిచంద్ చెప్పారు. వరుణ్ గుణగుణాల గురించి తన మాటల్లోనే చూద్దాం.
 
"వరుణ్ పక్కింటి అబ్బాయిలాగా ఉండేవాడు. చిన్నప్పటినుంచి తను నాకు తెలుసు ఎంత సంస్కారి అంటే పెద్దలంటే ఎంతో గౌరవం. ఫిదా సినిమాలో కూడా సాయిపల్లవి, నేను నాలుగు రోజులు షూటింగు చేసిన తర్వాత తాను వచ్చాడు. దర్శకుడిని కలవడానికి వచ్చాడు. నేనూ పల్లవి లోపల షూటింగులో ఉన్నాము. షూటింగ్ అయిపోయిన తర్వాత పల్లవి బయటకెళ్లి మళ్లీ పరుగెత్తుకొచ్చింది. 'నాన్నా నాన్నా ఇలా రా' అంది. 'ఏంటి తల్లీ' అని నేను వెళితే నా చేయి పట్టుకుని 'టాల్ నాన్నా' అంది. 'ఎవరు తల్లీ' అనడిగితే 'వరుణ్ నాన్నా' అంది. 'ఎక్కడమ్మా వరుణ్ కనబడలేదు' అన్నాను. అప్పుడు కో డైరెక్టర్ సూరి వచ్చి చెప్పాడు. 'మీరొస్తున్నారని చెప్పి ఆ పక్కకు వెశ్లి అలా నిలబడ్డాడు' అన్నాడు. ఎందుకంటే నాకోసం కుర్చీ ఖాళీ చేసి పక్కకు వెళ్లాడట. అంత గౌరవం ఉండేది నాపైన. పల్లవి చెప్పడంతో వరుణ్‌ని నేనే పిలిచి రమ్మన్నాను. నేను మీ పెద్దనాన్న గారు చిరంజీవితో కలిసి పని చేశాను అని చెప్పబోయాను. 'అయ్యో మంచుపల్లకీలో మీ నటన అంటే నాకు చాలా ఇష్టం' అన్నాడు. 
 
ఫిదా షూటింగులో నేను నా కుమార్తె పల్లవి సింపుల్‌గా ఉండేవాళ్లం. పల్లవి అయితే మొదటి సారి షూటింగుకు మాత్రమే వాళ్ల అమ్మను సహాయంగా తెచ్చుకుంది. తర్వాత అందరూ పరిచయం కావడంతో తానొక్కతే కోయంబత్తూరు నుంచి వచ్చి షూటింగు ముగించుకుని మళ్లీ ఒక్కతే వెళ్లిపోయేది. కుటుంబం నుంచి ఏ ఒక్కరినీ తీసుకొచ్చేది కాదు. మాకిద్దరికీ అసిస్టెంట్లూ ఎవ్వరూ ఉండేవారు కాదు. వరుణ్ షూటింగ్ సమయంలో ఒక ఫ్యాన్ తెచ్చుకునేవాడు. బాన్సువాడలో ఎక్కువ ఉక్క ఉండేది. అందుకని గాలికోసం తాను చిన్న ఫ్యాన్ తెచ్చుకునేవాడు. నా షాట్ అయిపోయి నేను వచ్చి కూర్చుంటే తను తెచ్చుకుని వాడుతున్న ఫ్యాన్ నావైపు తిప్పేవాడు. 'వరుణ్ నన్ను వదిలేసేయ్. నీకు ప్రాబ్లెమ్ కదా. ఫ్యాన్ గాలి నీకు కొంచెం అలవాటు కదా. నేను వాడను నాకు అలవాటు లేదు' అని చెబితే 'లేదు లేదు వాడండి' అనేవాడు. అంత మర్యాద ఇచ్చేవాడు. నిజంగానే వరుణ్ వెరీ నైస్ పర్సన్.. అన్నారు సాయిచంద్.
 
సంస్కారం అంటే చెబితే వచ్చేది కాదు కదా.. తన కంటే పెద్దవారికి తగిన గౌరవం ఇవ్వాలనేది కుటుంబ సంస్కారం నుంచే రావాలి. మెగా ఫ్యామిలీ కుర్రబ్యాచ్‌లో అందరికంటే వరుణ్‌లోనే అలాంటి సంస్కారం, పెద్దలను గౌరవించే తత్వం కాస్త ఎక్కువగా ఉన్నట్లుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి సాక్షిగా ప్రాంతీయతను బద్దలు గొట్టిన ఫిదా.. సాయిపల్లవికే సాధ్యమైందా?