Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆన్‌లైన్‌లో ‘భళిభళిరా భళి..’ పాట, భారత్‌లో ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో టాప్ (మీరూ చూడండి)

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి గత నెల 28వ తేదీన విడుదలైన చిత్రం బాహుబలి 2. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. పైగా, భారతదేశ చలన చిత్ర రికార్డులన్నీ తిరగరాసి, సరికొత్త చరిత్రకు నా

Advertiesment
ఆన్‌లైన్‌లో ‘భళిభళిరా భళి..’ పాట, భారత్‌లో ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో టాప్ (మీరూ చూడండి)
, శుక్రవారం, 19 మే 2017 (12:52 IST)
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి గత నెల 28వ తేదీన విడుదలైన చిత్రం బాహుబలి 2. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. పైగా, భారతదేశ చలన చిత్ర రికార్డులన్నీ తిరగరాసి, సరికొత్త చరిత్రకు నాందిపలికింది. 
 
చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తికావొస్తున్నా... థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ పాటను చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో బుధవారం విడుదల చేసింది. ఆ పాట ‘భళి భళి రా భళి..’. ఈ వీడియోను యూట్యూబ్‌లో 3,075,290 మంది వీక్షించారు. అద్భుతంగా తెర‌కెక్కించిన‌ ఈ పాట భారత్‌లో ట్విటర్‌ ట్రెండింగ్‌లో మూడోస్థానంలో నిలిచింది. 
 
బాహుబ‌లి ప్ర‌భాస్ ఏనుగుపైకి ఎక్కి బాణం వేయ‌డం, శివ‌గామి ఒడిలో చిన్న‌పిల్లాడిలా ప‌డుకోవ‌డం, బాహుబ‌లి1 లో అమ‌రేంద్ర బాహుబ‌లి చేసిన సాహ‌సాలు ఈ పాట‌లో క‌న‌ప‌డ‌తాయి. ప్ర‌భాస్ గుర్ర‌పు స్వారీ, మాహిష్మ‌తి ప్ర‌జ‌ల బాహుబ‌లి నినాదాల‌ను కూడా ఈ పాట‌లో చూపించారు. కీరవాణి ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను మీరూ చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రియ ప్లీజ్ అది చెయ్...! ఏంటది..?