Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా.. బాహుబలి ఫ్యాన్స్‌కి ప్రణమిల్లిన రాజమౌళి

బాహుబలి ది కంక్లూజన్ సినిమా విడుదలైన తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఆదరిస్తున్న అశేష అభిమానులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. తెలుగు సినిమాకు ఇంత కలెక్షన్ల రికార్డును తెచ్చిన బాహుబలి ఫ్యాన్స్‌కి, మద్దతు

మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా.. బాహుబలి ఫ్యాన్స్‌కి ప్రణమిల్లిన రాజమౌళి
హైదరాబాద్ , సోమవారం, 1 మే 2017 (08:35 IST)
బాహుబలి ది కంక్లూజన్ సినిమా విడుదలైన తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఆదరిస్తున్న అశేష అభిమానులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. తెలుగు సినిమాకు ఇంత కలెక్షన్ల రికార్డును తెచ్చిన బాహుబలి ఫ్యాన్స్‌కి, మద్దతుదారులకు రాజమౌళి అభివాదం చేస్తున్నట్లు ప్రకటించారు. చిత్రం విడుదలకు ముందు ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ , తొలినుంచి ఈ సినిమాను ప్రేమిస్తూవచ్చిన ఫ్యాన్స్, మద్దతుదారుల అభిమానంతోటే అన్ని అడ్డంకులను అధిగమించి సినిమాను ఈ స్థాయిలో వారిముందుకు తీసుకురాగలిగాం అని రాజమౌళి చెప్పారు. 
 
బాహుబలి వంటి మెగా ప్రాజెక్టును విడుదల చేసే సమయంలో అడ్డంకులు ఎదుర్కోవడం సహజం. కాని బాహుబలి ఫ్యాన్స్ మాపై తొలినుంచి చూపిన అపారమైన అభిమానం, మద్దతు వల్లే అడ్జంకులను అధిగమించగలిగాం అని రాజమౌళి ట్వీట్ చేశారు. గత అయిదేళ్లుగా మా వెన్నంటి నిలిచి, మద్దతు కొనసాగించి ప్రతి మలుపులో మమ్మల్ని ప్రోత్సహిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మా జీవితం చివరి వరకు మా గుండెల్లో దాచుకునేంత గొప్ప విజయాన్ని మాకు మీరే అందించారు అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. 
 
rajamouli ss ✔ @ssrajamouli
Its only natural that a big project like Baahubali faces hurdles during release. I must say that the enormous love and support that was
 
rajamouli ss ✔ @ssrajamouli
given by Baahubali Fans made us cruise through the obstacles.
Thank you everyone who have been with us for the past 5 years encouraging us
 
2015 జూలై 10న విడుదలైన బాహుబలి ది బిగినింగ్ ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లు వసూలు చేసి బాక్సాఫీసు చరిత్ర తిరగరాసింది. 2017 ఏప్రిల్ 28న హిందీ, తమిళం, తెలుగు, మలయాళీ భాషల్లో విడుదలైన బాహుబలి ది కంక్లూజన్ తొలి రోజున దేశీయంగా 121 కోట్ల వసూళ్లతో భారతీయ సినిమాల చరిత్రలో అతి పెద్ద ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డును సృష్టించింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో తెలుగు సినిమాల కలెక్షన్ల రికార్డును బాదిపడేసిన బాహుబలి-2: రెండురోజుల్లో 56 కోట్లు