Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇదే నా చివరి పాట... గాయనీమణి ఎస్.జానకి సంచలన నిర్ణయం... కారణం ఏమిటి?

కోకిల స్వరంతో కోట్ల మంది శ్రోతలను ఆకట్టుకున్న లెజండ్రీ నేపథ్య గాయని ఎస్.జానకి. తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలతో పాటు అనేక భారతీయ భాషలలో తన కమ్మని స్వరంతో గేయాలను ఆలపించారు. తమిళమే రాని జానకి మ

ఇదే నా చివరి పాట... గాయనీమణి ఎస్.జానకి సంచలన నిర్ణయం... కారణం ఏమిటి?
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (16:44 IST)
కోకిల స్వరంతో కోట్ల మంది శ్రోతలను ఆకట్టుకున్న లెజండ్రీ నేపథ్య గాయని ఎస్.జానకి. తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలతో పాటు అనేక భారతీయ భాషలలో తన కమ్మని స్వరంతో గేయాలను ఆలపించారు. తమిళమే రాని జానకి మొట్టమొదటిసారిగా తమిళంలోనే పాడారు. అవి రెండూ విషాద గీతాలే. టి.చలపతిరావు సంగీత దర్శకత్వం వహించిన 'విధియిన్‌ విళైయాట్టు' అనే తమిళ చిత్రంలో 4.4.1957న ఆమె తొలిసారిగా 'పేదై ఎన్‌ ఆసై పాళా న దేనో' అనే శోకగీతంతో తన కెరీర్‌ను ప్రారంభించారు. అయితే ఆ చిత్రం విడుదల కాలేదు. 5.4.1957న 'ఎం.ఎల్‌.ఎ.' సినిమా కోసం ఘంటసాలతో కలిసి 'నీ ఆశ అడియాస... చేయి జారే మణిపూస... బ్రతుకంతా అమవాస లంబాడోళ్ల రాందాసా' అనే విషాద గీతం పాడారు. ఇది కూడా విషాద గీతం కావడం యాదృచ్ఛికమే. అంతేకాదు ఆమె మలయాళంలో పాడిన తొలి గీతం కూడా శోక గీతమే.
 
ఆమె పాడటం ప్రారంభించిన తొలి సంవత్సరమే(1957) 6 భాషల్లో 100 పాటలకు పైగా పాడి రికార్డు సృష్టించారు. ఇళయరాజా ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానకి గురించి మాట్లాడుతూ''జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె ప్రతిరోజూ కొన్ని లీటర్ల తేనె తాగుతుంటారు. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా'' అని జానకి గాత్రంలోని మాధుర్యం గురించి చమత్కరించారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె గానంలో మాధుర్యం ఎంతో... 'సంగీత జానకి'గా సంగీతాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్న అద్భుత గాయనీమణి జానకమ్మ. గాయనిగా, సంగీత దర్శకురాలిగా దాదాపు 15 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడి నవరసాలు ఒలికించారు. సరికొత్త రికార్డు, ఒరవడిని సృష్టించారు. 
 
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు అనేక భారతీయ భాషలలో తన కమ్మని స్వరంతో వీనుల విందు చేసిన గాయకరత్నం.. తెలుగు పాటను తేనెలో ముంచి అందించిన గాయని జానకి. కథానాయికల కోసం పడుచుదనం పరిగెత్తే పాటలు పాడటమే కాదు, పసి పిల్లలకు .. వయసు పైబడిన పాత్రలకు సైతం పాడుతూ ఆమె ఆశ్చర్యపరిచారు. వివిధ భాషల్లో 48 వేలకి పైగా పాటలు పాడిన ఆమె, తాజాగా ఒక మలయాళ సినిమాకి పాడారు. అనూప్ మీనన్.. మీరా జాస్మిన్ కాంబినేషన్లో '10 కాల్పనికాల్' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో "అమ్మా పూవీను .. " అనే పాటను జానకి పాడారు. తనకి నచ్చిన పాటల్లో ఇది ఒకటి అని జానకి అన్నారు. తన కెరియర్లో ఇదే చివరి పాట అవుతుందనీ, ఇక తాను సినిమాల్లో గానీ.. స్టేజ్‌లపై గాని పాడనని చెప్పారు. ఇది నిజంగా ఆమె అభిమానులకు బాధను కలిగించే విషయమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అరుంధతి' కోడి రామకృష్ణ మరో విజువల్ వండర్ చిత్రం 'నాగభరణం'