Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్.. ప్రమోషన్‌లో ఆ ముగ్గురు.. రిమైండర్ లిస్ట్‌లో...

Advertiesment
rrrforoscars
, మంగళవారం, 10 జనవరి 2023 (20:06 IST)
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కోసం హాలీవుడ్ చేరింది. అంతర్జాతీయంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు కోసం ప్రమోషన్‌కు సిద్ధమైంది. ఆస్కార్-గోల్డెన్ గ్లోబ్స్‌తో సహా హాలీవుడ్ అవార్డుల వేడుకలకు హాజరు కావడానికి RRR బృందం సిద్ధమైంది. ఇందుకోసం చురుగ్గా ప్రచారం చేసుకుంటోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి సినిమా ప్రమోషన్ కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. 
 
అభిమానులు, ఫోటోగ్రాఫర్‌ల బృందం లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని వారిని అభినందించారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వారిని కలిసేందుకు వారితో సెల్ఫీలు తీసుకునేందుకు.. ఆటో గ్రాఫ్ కోసం ఎగబడ్డారు. రాజమౌళితో పాటు ఆర్ఆర్ఆర్ బృందం విలేకరుల సమావేశాలలో పాల్గొంటారు. స్వాతంత్ర్య సమరానికి ముందు భారతదేశంలోని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల జీవిత కథను ఆధారంగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కింది.
 
మరోవైపు ఆస్కార్ 2023 రిమైండర్ లిస్ట్‌లో RRR,కాంతారా, గంగూబాయి కతియావాడి సినిమాలు చోటు సంపాదించాయి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 95వ అకాడమీ అవార్డుల కోసం రిమైండర్ జాబితాను విడుదల చేసింది ఇందులో భారతీయ సినిమాలు ఆర్ఆర్ఆర్, కాంతారావు, గంగూబాయి కతియావాడి సినిమాలు నిలిచాయి. 
 
ఆర్ఆర్ఆర్ సినిమా 1920ల నాటిది. పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా ఇది తెరకెక్కింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్ తదితరులు నటించారు. ఈ చిత్రంలోని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు దేశంతో పాటు..  ప్రపంచవ్యాప్తంగా భారీ బజ్‌ను సృష్టించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండు సినిమాలు చేస్తున్నపుడు నాన్న గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు : శృతిహాసన్