Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమిత్‌ త్రివేది, స్లోచీతా పాడిన మూడో ఒరిజినల్‌ ‘మొహబ్బత్‌’ పాటను వయాకామ్‌18 భాగస్వామ్యంతో రాయల్‌ స్టాగ్‌ బూమ్‌బాక్స్‌ విడుదల

Advertiesment
image
, సోమవారం, 21 ఆగస్టు 2023 (11:58 IST)
వయాకామ్‌18 సహకారంతో బాలీవుడ్‌ మెలోడీని హిప్‌- హాప్‌ ప్రవాహంతో సమ్మిళితం చేస్తూ పూర్తి సరికొత్త జోనర్‌కు శ్రీకారం చుడుతూ తరాలు నిలిచిపోయే ఒరిజినల్‌  సౌండ్‌ను తీసుకువస్తోంది రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్. సంగీతం అనేది అన్ని వయస్సుల వారిలో భావోద్వేగాలను రేకేత్తిస్తుంది. సీగ్రామ్ రాయల్ స్టాగ్‌కు ఇది కీలక పునాదిరాయి. ఈ ఆధునిక యుగపు యువ ప్రేక్షకులు ఉత్తేజకరమైన కొత్త సంగీత స్వరూపాలను అన్వేషించడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ‘లివింగ్ ఇట్ లార్జ్’ స్ఫూర్తిని అందిపుచ్చుకొని మణిపాల్, భువనేశ్వర్, పూణే, ఇండోర్ & డెహ్రాడూన్‌లోని వేలాది మంది సంగీత ప్రియులను తనదైన ప్రత్యేక అనుభూతి ద్వారా ఆకట్టుకున్న రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ 4 ఒరిజినల్ మ్యూజిక్ వీడియోలతో తదుపరి దశలోకి ప్రవేశించనుంది. విడుదల చేస్తున్న మూడో ఒరిజినల్ మ్యూజిక్ ట్రాక్ మ్యూజిక్‌ మ్యాస్ట్రో, అమిత్‌ త్రివేది, జస్లీన్ రాయల్, స్పంకీ రాపర్ స్లోచీటా మధ్య ప్రత్యేకమైన సహకారంతో రూపుదిద్దుకుంది.
 
కొత్త పాట ‘మొహబ్బత్’ మనకు ఇప్పటివరకు తెలిసిన అత్యంత శక్తివంత భావోద్వేగమైన ప్రేమపై మన నమ్మకాన్ని బలపరుస్తుంది. ప్రేమ గురువు (తత్వవేత్త) పాత్రలో కనిపించే అమిత్ త్రివేది, ప్రేమను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు భయపడుతున్న ఫ్రెషర్‌ స్లోచీతాను ప్రోత్సహిస్తారు. దేశీ మెలోడీ, హిప్-హాప్ బీట్‌ల సంపూర్ణ సమ్మేళనం ఈ పాట. ఇది ప్రేమలో పడే వివిధ దశలను తెలియజెప్తుంది. రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ ప్రత్యేకమైన ఫిజిటల్ ఫార్మాట్‌లో భాగంగా వివిధ వేదికల్లో విడుదలవుతున్న మెలోడీ x హిప్ హాప్ మ్యూజిక్ ట్రాక్‌ సిరీస్‌లో ఇది మూడో ఒరిజినల్‌ సాంగ్‌.
 
ర్యాపర్‌ స్లోచీతా మాట్లాడుతూ, “రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ ఒక అద్భుతమైన వేదిక. ఇక్కడ మావంటి కళాకారులు పరస్పరం సహకరించుకొని మనల్ని మేము వ్యక్తీకరించుకోవచ్చు. అమిత్ త్రివేది వంటి ఐకాన్‌తో కలిసి పని చేసే అవకాశం  లభించి  ప్రత్యేకమైన  ఈ ట్రాక్ సృష్టించడం వెలకట్టలేని అనుభూతి. ఇది చాలా కాలం పాటు నాతో నిలిచి ఉంటుంది.”. మ్యూజిక్‌ కంపోజర్‌, గాయకుడు అమిత్‌ త్రివేది మాట్లాడుతూ, “స్లోచీతాతో కలిసి  మొహబ్బత్‌ చేయడం నాకు ఎంతో సరదాగా సాగింది. ఇది ర్యాప్ శక్తితో మిళితమైన బాలీవుడ్ వినోదభరితమైన మ్యూజిక్‌ వైబ్‌ను సంగ్రహించే ఒక అద్భుతమైన పాట. రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ అటువంటి సరికొత్త సౌండ్స్‌ను ప్రేక్షకులకు అందజేస్తూ గొప్ప పని చేస్తోంది.”
 
సీగ్రామ్ రాయల్ స్టాగ్‌కి కీలకమైన అభిరుచి పునాది స్తంభంగా నిలుస్తుంది సంగీతం. నేటి యువత అద్భుతమైన సంగీత రూపాలు అన్వేషించడం వైపు మొగ్గు చూపుతోంది. హిప్-హాప్ వంటి సమకాలీన జోనర్స్‌ బాగా ప్రాచుర్యం పొందుతున్నా బాలీవుడ్ మెలోడీలు యువత సాంస్కృతిక ప్రయాణంలో అంతర్భాగంగా నిలుస్తున్నాయి. ఈ తరం ఊహలను ఉత్తేజపరిచి  వారు వారసత్వంగా పొందిన బాలీవుడ్ సంగీతాన్ని వారు మాట్లాడుకునే జోనర్‌ హిప్‌ హాప్‌తో మిళితం చేయాలని రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ భావిస్తోంది. ఇప్పుడు మూడో పాట మొహబ్బత్ యూట్యూబ్‌ సామాజిక,  ప్రధాన ఆడియో ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా వీధుల్లో తల్లితో కలిసి హీరోయిన్ సమంత చక్కర్లు..