Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ నటితో సంబంధం ఉందని కొట్టడానికి వచ్చిన సంజయ్ దత్ : రిషి కపూర్

బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్. ఆయన "ఖుల్లాం.. ఖుల్లా" అనే పేరుతో తన ఆత్మకథను రాశారు. ఇటివలే విడుదలైన ఈ బుక్‌లో తన తండ్రి రాజ్‌కపూర్ రాసలీలలు, ఆయనకు హీరోయిన్లతో ఉన్న సంబంధం బాంధవ్యాలను విపులీకరించా

ఆ నటితో సంబంధం ఉందని కొట్టడానికి వచ్చిన సంజయ్ దత్ : రిషి కపూర్
, గురువారం, 19 జనవరి 2017 (15:05 IST)
బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్. ఆయన "ఖుల్లాం.. ఖుల్లా" అనే పేరుతో తన ఆత్మకథను రాశారు. ఇటివలే విడుదలైన ఈ బుక్‌లో తన తండ్రి రాజ్‌కపూర్ రాసలీలలు, ఆయనకు హీరోయిన్లతో ఉన్న సంబంధం బాంధవ్యాలను విపులీకరించారు. అలాగే, ఈ పుస్తకంలోనే తన వ్యక్తి విషయాలు కూడా వెల్లడించారు.
 
బాలీవుడ్ హీరోయిన్ టీనా మునిమ్‌తో తనకు సంబంధముందని హీరో సంజయ్ దత్ అనుమానించాడని నటుడు రిషి కపూర్ తెలిపారు. కానీ, అప్పుడు సంజయ్ పట్ల టీనా ఆకర్షితురాలైందని తెలిపారు. అప్పట్లో మీడియా ఇప్పుడున్నంత ఫాస్ట్ గా లేదని... కానీ, బాలీవుడ్ ప్రముఖులంతా తాను, టీనా ఇద్దరూ సీక్రెట్ లైఫ్ అనుభవిస్తున్నామని భావించేవారని తెలిపారు. 
 
ఈ విషయం తెలుసుకున్న సంజయ్ దత్ ఇది నిజమే అనుకున్నాడని తన ఆత్మకథలో రిషి కపూర్ తెలిపారు. ఒకరోజు గుల్షన్ గ్రోవర్‌తో కలిసి తనతో గొడవపడటానికి నీతూ ఇంటికి సంజయ్ దత్ వచ్చాడని పేర్కొన్నారు. అప్పటికి తనకింకా పెళ్లి కాలేదని... అయితే, ఇద్దరి మధ్య గొడవ జరగకుండా నీతూ పరిష్కారం చేసిందని తెలిపారు.
 
తనకు, టీనాకు మధ్య ఎలాంటి అఫైర్ లేదని... ఇవన్నీ కేవలం పుకార్లేనని... కో స్టార్లుగా ఇద్దరూ సన్నిహితంగా మాత్రమే ఉన్నారని సంజయ్‌కు నీతూ వివరించిందని గుర్తు చేసుకున్నారు. అంతటితో ఆ వివాదం సమసిపోయిందని చెప్పారు. ఆ తర్వాత నీతూను తాను వివాహం చేసుకున్నానని... తమ పెళ్లికి సంజయ్ దత్‌తో పాటు హీరోయిన్లు అందరూ వచ్చారని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవిగారు.. చిరంజీవిగారే అని ప్రూవ్ అయిపోయింది.. మరి బాలకృష్ణ సంగతేంటి? : తమ్మారెడ్డి భరద్వాజ్