ఆర్.ఆర్.ఆర్. ట్రైలర్ లో అగ్నిలోంచి అల్లూరి సీతారామరాజు గెటప్‌లో రామ్‌చరణ్ వచ్చి బాణాలు బ్రిటీష్ వారిపై సంధిస్తాడు. ఆ వెనుక ఓ సంగీతంతోపాటు రైజ్ ఆఫ్ రామ్ ఫైరీబీట్స్ చక్కగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఓ పాటను ఈ రోజు రాత్రి 9గంటలకు చిత్ర యూనిట్ విడుదలచేయనుంది.
ఎం.ఎం. కీరవాణి స్వరపరిచగా K. శివ దత్తా రాసిన సంస్కృత సాహిత్యం ఇది. తెలుగు పదాలుకూడా జోడించి చక్కటి పాటగా దీన్ని రూపొందించాడు దర్శకుడు రాజమౌళి. రామం రాఘవం అనే ఈ పాట మ్యూజిక్ వీడియోను రాత్రి విడుదల చేయబోతున్నారు. ఈ గీతాన్ని విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్ మరియు కోరస్ పాడారు.
ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్‌ను దేశంలో పలు రాస్ట్రాలలో పర్యటించి నిర్వహించారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదలచేయనున్నారు. బాలీవుడ్, కోలీవడ్ వంటి నటీనటులు ఇందులో నటించారు.