దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదీ చేసినా గోల గోల అవుతుంది. తాజాగా ఆయన వెబ్ సిరీస్ చేశాడు. దానికి ఇది మహాభారతం కాదు అని పేరుపెట్టి ట్విట్టర్‌లో బయటకు వదిలాడు. నిర్మాత, దర్శకులు వేరు.. వర్మ పేరు లేదు. కేవలం ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వెబ్ సిరీస్‌ను, స్పార్క్ ఓటీటీ సంస్థతో కలిసి తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు.
వర్మ వాయిస్‌తో... వుంది. గిది 2019ల తెలంగాణలో ధర్మన్న, దుర్యన్న ఫ్యామిలీల నడిమిట్ల లొల్లి లేపిన ద్రుపది, కొట్లాట పెట్టిన గోపాల్ యాదవ్ గాని కథ ఆధారంగా తీస్తున్న వెబ్ సిరీస్‌గా ఆర్జీవీ ప్రకటించారు. సిరాశ్రీ రచనలో, ఆనంద్ చంద్ర దర్శకత్వంలో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కుతున్నట్లు వర్మ తెలిపారు. ఇంకా మాట్లాడుతూ.., టైటిల్‌తోనే పిచ్చ క్లారిటీ ఇస్తున్నానని, చెవులు తెరుచుకుని వినాలని ఆర్జీవీ ఆడియో క్లిప్‌లో ఆర్జీవీ పేర్కొన్నారు.
మహాభారతం పుట్టకముందునుంచి.. అత్యాచారాలు, హత్యలు, గొడవలు, అన్నదమ్ముల పోరు, ఇవన్నీ వున్నాయి. ఇంకా వుంటాయి. ఇంకా చెప్పాలంటే.. మనిషి జాతి అంతరించి పోయే వరకు ఇవన్నీ వుంటాయి. అవన్నీ కళ్ళగప్పించి చూడండి.. వినండి.. ధర్మవాదులు, అతివాదులు, అతిగా ఆలోచించి బుర్రపాడుచేసుకోకండి.. అంటూ చమక్కులు పేల్చారు.
తెలంగాణలో ఓ గ్రామంలో జరిగిన ఈ కథ. దానికి మహాభారతం పాత్రలు గుర్తుకు వచ్చి టైటిల్ పెట్టామని పిచ్చక్లారిటీతో చెబుతున్నాడు. వెబ్ సిరీస్‌ను కూడా సినిమా లెవల్లో ప్రచారం చేస్తున్నాడు. మరి ఇది ఎలా వుంటుందో.... చూడాలి..