Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 30 March 2025
webdunia

దేవినేని నెహ్రూ మరణం నాకు పెద్ద షాక్ : రాంగోపాల్ వర్మ ట్వీట్

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అలియాస్ దేవినేని రాజశేఖర్ మృతిపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. "దేవినేని నెహ్రూ మరణం నాకు పెద్ద షాక్‌. ఆయనతో నేను గడిపిన సమయాన్ని గుర్తు చేస

Advertiesment
దేవినేని నెహ్రూ మరణం నాకు పెద్ద షాక్ : రాంగోపాల్ వర్మ ట్వీట్
, సోమవారం, 17 ఏప్రియల్ 2017 (13:40 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అలియాస్ దేవినేని రాజశేఖర్ మృతిపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. "దేవినేని నెహ్రూ మరణం నాకు పెద్ద షాక్‌. ఆయనతో నేను గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఆయన ఒక బలమైన రాజకీయ శక్తికి చిహ్నంగా నేను భావిస్తాను" అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. 
 
కిడ్నీ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన దేవినేని సోమవావం వేకువజామున కన్నుమూసిన విషయం తెల్సిందే. నెహ్రూ మృతిపట్ల విజయవాడ ప్రజలతో పాటు.. టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు దేవినేని మృతికి సంతాపం తెలియజేశారు. అలాగే, రాంగోపాల్ వర్మ కూడా స్పందించారు. 
 
కాగా, రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'వంగవీటి'లో దేవినేని నెహ్రూను హీరోగా చూపించిన విషయం తెల్సిందే. వంగవీటి సినిమా సమయంలోనే పలు సార్లు దేవినేని కుటుంబ సభ్యులతో వర్మ భేటీ అయ్యారు. సినిమాకు సంబంధించిన పలు విషయాల్లో దేవినేని వారి సహాయ సహకారం వర్మకు అందినట్లుగా టాలీవుడ్‌లో చర్చ కూడా సాగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కింద అండర్ వేర్... పైన మల్టీకలర్ వస్త్రంతో ఎద అందాలను కవర్ చేస్తూ...