విశ్వనాథ్‌కు దాదా ఫాల్కే ఇవ్వడం నాకు సంతోషంగా లేదు : రాంగోపాల్ వర్మ ట్వీట్
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు ట్వీట్ చేశారు. ఈ దఫా దర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడంపై ఆయన స్పందించారు.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు ట్వీట్ చేశారు. ఈ దఫా దర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడంపై ఆయన స్పందించారు.
ఇదే విషయంపై ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. విశ్వనాథ్‌కి దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల తాను సంతోషంగా లేనని అన్నాడు. ఎందుకంటే ఆయన దాదా సాహేబ్ ఫాల్కే కంటే చాలా గొప్ప దర్శకులంటూ వివరణ ఇచ్చాడు.
తాను దాదాసాహేబ్ సినిమాలూ చూశానని, విశ్వనాథ్ సినిమాలూ కూడా చూశానని అన్నాడు. తన ఉద్దేశంలో దాదా సాహేబ్‌కే విశ్వనాథ్ పేరు మీద అవార్డు ఇవ్వాలని ఆర్జీవీ విజ్ఞప్తి చేశారు.
కాగా, దర్శకధీరుడు జక్కన్న మాత్రం నాకు నచ్చలేదు... అసాధారణ దర్శకులు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారిని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది తెలుగు సినిమాకు గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు.