Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించగలుగుతున్న ఎన్టీఆర్ : రామ్ గోపాల్ వర్మ

సెప్టెంబర్ ఒకటో తేదీన కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న 'జనతా గ్యారేజ్‌' హిట్‌తో యూనిట్ సభ్యులు ఖుషి ఖుషీగా ఉన్నారు. మొదటి రోజు కలెక్షన్లతో దుమ్ము రేపిన గ్యారేజ్ రెండో రోజు బంద్ ప్రభావంతో కాస్త నెమ్మదించ

Advertiesment
RGV Praises Jr NTR in Janatha Garage
, మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (10:31 IST)
సెప్టెంబర్ ఒకటో తేదీన కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న 'జనతా గ్యారేజ్‌' హిట్‌తో యూనిట్ సభ్యులు ఖుషి ఖుషీగా ఉన్నారు. మొదటి రోజు కలెక్షన్లతో దుమ్ము రేపిన గ్యారేజ్ రెండో రోజు బంద్ ప్రభావంతో కాస్త నెమ్మదించింది. మళ్ళీ శనివారం స్టడీ కలెక్షన్స్‌తో కంటిన్యూ అవుతుంది. ఫైనల్ ఫిగర్ గెస్ చేయడం కష్టంగాని, రూ.50 కోట్ల క్లబ్‌లో మాత్రం గ్యారెంటీగా జనతా గ్యారేజ్ అడుగుపెడుతుందని సినీనిపుణులు అంటున్నారు.
 
ఈ సినిమాపై పలువురు సినీప్రముఖులు ప్రశంసలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ జనతా గ్యారేజ్ సినిమాని ఇటీవల చూశారు. ఆర్జీవీ తెలుగు సినిమాల్ని తక్కువగా చూస్తారు. ఎప్పుడు విచిత్రమైన ప్రకటనలు చేస్తూ వివాదాల్లో చిక్కుకునే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏం తోచలేదేమోగాని ఎన్టీఆర్‌ని ప్రశంసలతో ముంచ్చెత్తాడు. 
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాస్ హీరోలా చేశాడని పొగడ్తల వర్షాన్నికురిపించాడు. నటనలో జూనియర్.. సీనియర్ ఎన్టీఆర్‌ని మించిపోయాడని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. జూనియర్ రోజురోజుకూ నటనలో ఎదిగిపోతాడని చెప్పుకొచ్చాడు వర్మ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ యాక్టింగ్ అదిరిపోయిందని, సీనియర్ ఎన్టీఆర్ ఒక్క మాస్ ఆడియన్స్‌‌కే పరిమితమైతే... ఈ ఎన్టీఆర్ క్లాస్ ఆడియన్స్‌‌ని కూడా మెప్పించగలుగుతున్నాడు అని వర్మ జూనియర్‌పై ప్రసంశల జల్లు కురిపించాడు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంతా ఖుషి ఖుషిగా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవితో స్టెప్పులేయనున్న బన్నీ హీరోయిన్ కేథరిన్.. మాస్ మసాలా సాంగ్‌లో?