Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా ముందూ వెనకా డబ్బా కొట్టేవాళ్లే తయారైతే ప్లాఫులు రాక చస్తాయా: ఏడుస్తున్న వర్మ

శివ సినిమాతో తెలుగు చలన చిత్ర నిర్మాణ దిశాదశనే మార్చివేసిన రాంగోపాల్ వర్మ.. రంగీలా సినిమాతో బాలీవుడ్ ఫిలిం పరిశ్రమ చలనాన్నే మార్చివేసిన రాంగోపాల్ వర్మ మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగానే నిప్పులు చిమ్ముకుంటూ

నా ముందూ వెనకా డబ్బా కొట్టేవాళ్లే తయారైతే ప్లాఫులు రాక చస్తాయా: ఏడుస్తున్న వర్మ
హైదరాబాద్ , గురువారం, 23 మార్చి 2017 (05:43 IST)
శివ సినిమాతో తెలుగు చలన చిత్ర నిర్మాణ దిశాదశనే మార్చివేసిన రాంగోపాల్ వర్మ.. రంగీలా సినిమాతో బాలీవుడ్ ఫిలిం పరిశ్రమ చలనాన్నే మార్చివేసిన రాంగోపాల్ వర్మ మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగానే నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగురుతున్న దశలోనే నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపడ్డాడు. కలెక్షన్లకు మినిమమ్ గ్యారెంటీ ఇస్తూనే ప్రయోగాత్మక చిత్రాలను తీసిన వర్మ  ఒక దశ తర్వాత పూర్తిగా గాడి తప్పారు. వరుస ప్లాఫ్‌లు, దెయ్యాల భూతాల చిత్రాలు.. వర్మలోన చెత్తనంతా బయటపెట్టి అందరినీ భయపెట్టాయి.
 
ఒకనాటి టాప్ డైరెక్టర్ ఈనాటి ప్లాఫ్ డైరెక్టరుగా కిందికి దిగిపోయిన పరిణామాలను రాంగోపాల్ వర్మే స్వయంగా చెప్పుకున్నాడు. చివరకు తన వైఫల్యాలకు కారణాలెంటో తానే చెప్పుకుంటూ ముందుకు వచ్చాడు. తన ఫెయిల్యూర్స్‌పై సరైన అంచనాకు వచ్చినట్లే కనబడుతోంది. తన ముందూ వెనకా చేరినవారు తాను తీసే సినిమాల గురించి నిజమైన ఫీడ్ బ్యాక్ ఇవ్వనందుకే తన సినిమాలు మటాష్ అయ్యాయని వర్మ ఒప్పుకున్నాడు. 
 
సినిమా చిత్రీకరిస్తున్నప్పుడే నిజాయితీగా, నిక్కచ్చిగా సినిమా గురించి అభిప్రాయం చెప్పేవారు ఈరోజుల్లో కరువైపోయారని వర్మ చెబుతున్నారు. షూటింగ్ దశలో ఇలాంటి నిక్కమైన ఫీడ్ బ్యాక్ రానందుకే తన సినిమాలు వరుసగా గల్లంతయ్యాయని వర్మ అన్నారు. చిత్ర నిర్మాణ దశలోనే బాగుంది, బాగులేదు అంటూ నిజాయితీగా అభప్రాయం చెప్పేవారి కోసం తాను ప్రయత్నిస్తూనే ఉంటానని కాని చాలాసార్లు అలాంటి అభిప్రాయం తనకు దొరకలేదన్నారు. నీవు తీసే కంటెంటుపై నీకు నమ్మకం ఉండాలి, లేకుంటే సినిమా తీయలేవు. అదే సమయంలో ఇతరులు నీ కంటెంటును ఏమనుకుంటున్నారు అని తెలుసుకోకపోతే అయపోతామని వర్మ ఒప్పేసుకున్నారు. 
 
అయితే సమకాలీన నటుల్లో అమీర్ ఖాన్ ఒక్కడు మాత్రమే నిజాయతీతో కూడిన ఫీడ్ బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నారని వర్మ ప్రశంసించారు. తనకు అందుతున్న ఫీడ్ బ్యాక్‌కి అనుగుణంగా తనలోని లోపాలను అమీర్ సరిదిద్దుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. నేను సత్య సినిమా తీసేరోజుల్లో ఇలాగే చేసేవాడిని, కొన్ని సార్లు రీ షూట్ కూడా చేసేవాడిని అంటున్న వర్మ, ఇప్పుడు అమితాబ్‌తో కలిసి తీస్తున్న సర్కార్-3  విషయంలో ఇదే పంధా అవలంబిస్తున్నానని వర్మ చెప్పారు. 
 
వర్మ ఆలస్యంగా అయినా సత్యం గ్రహించినందుకు మంచి ఫలితాలే వస్తాయేమో. చూద్దాం మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెప్పాను... అందుకే ఆమె ఇప్పుడు నాకు అత్త కాబోతోంది...