Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏంటి బిగ్ బాస్... ఈ టాస్కులు... కాస్త ఆలోచిస్తే బాగుంటుందేమో?

బిగ్‌బాస్‌ ఇంటి తలుపులు తెరుచుకుని 30 రోజులు గడిచిపోయాయి. అయినా ఇంకా పూర్తిగా గాడిలో పడలేదు. 29వ రోజు శెభాష్‌ అనిపించిన బాస్‌, మంగళవారం నాటి ఎపిషోడ్‌ను తుస్సుమనిపిచించారు. ‘మంచోళ్లు - చెడ్డోళ్లు’ పేరుతో ఇచ్చిన టాస్క్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. మంచోళ్లుగా

Advertiesment
Review
, గురువారం, 12 జులై 2018 (14:54 IST)
బిగ్‌బాస్‌ ఇంటి తలుపులు తెరుచుకుని 30 రోజులు గడిచిపోయాయి. అయినా ఇంకా పూర్తిగా గాడిలో పడలేదు. 29వ రోజు శెభాష్‌ అనిపించిన బాస్‌, మంగళవారం నాటి ఎపిషోడ్‌ను తుస్సుమనిపిచించారు. ‘మంచోళ్లు - చెడ్డోళ్లు’ పేరుతో ఇచ్చిన టాస్క్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. మంచోళ్లుగా ఏడుగురు, చెడ్డోళ్లుగా ఆరుగురు వ్యవహరించాలి. మంచోళ్లు అన్నీ మంచి పనులే చేయాలి. చెడ్డోళ్లు అన్నీ చెడ్డ పనులే చేయాలి. మంచోళ్లు చేసే పనులను చెడ్డోళ్లు చెడగొడుతూ ఉండాలి. చెడ్డోళ్లలో హమీద్‌, తేజస్వీ భాను, గణేష్‌, రోల్‌రైడా, సామ్రాట్‌ ఉన్నారు. మంచోళ్లలో బాబు గోనినేని, తనీష్‌, దీప్తి, సునయన, నందిని తదితరులున్నారు.
 
అయితే… చెడ్డోళ్లు ఎక్కువ ఉత్సాహపడిపోయారు. చెడ్డోళ్లుగా చేయమంటే దెయ్యాలులా చేశారు. నటన కూడా అదేవిధంగా ఉంది. ఇంటిని చిందరవందర చేశారు. మంచోళ్లు ఇంటిని సర్ధలేక చచ్చిపోయారు. దీంతో మంచివాళ్లు కూడా చెడ్డవాళ్లులా మారి చెడ్డవాళ్లను బాత్‌రూమ్‌లోకి వెళ్లనీకుండా తలుపుకు కర్రలు అడ్డుపెట్టేశారు. ఈ టాస్క్‌ ఇంకా కొనసాగుతోందిగానీ.. అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.
 
అయినా బిగ్‌బాస్‌ ఇస్తున్న టాస్క్‌లన్నీ ఇలాగే వుంటున్నాయి. కాస్త కసరత్తు చేస్తే ఇదే టాస్క్‌ను ఆహ్లాదకరంగా మార్చడానికి వీలుంది. మంచి, చెడు ఉన్నప్పుడు ఏది మంచో ఏది చెడో చెప్పేవాళ్లు కూడా ఉండాలి. పోలీసులు, న్యాయమూర్తులు వంటి పాత్రలు కూడా పెట్టి వుంటే ఇదే టాస్క్‌ మరింత ఆసక్తిగా ఉండేది. ఇప్పుడు ఆహ్లాదం బదులు గందరగోళంగా తయారవుతున్నాయి. కాన్సెప్ట్‌లు కావాలని ప్రేక్షకులను అడిగితే బోలెడన్ని రాసి పంపుతారు. ఇలా చేయడం వల్ల ప్రేక్షకులనూ భాగస్వాములను చేసినట్లు అవుతుంది. ఆలోచించు బిగ్ బాస్...!!
 
ఇక మధ్యలో కొంతసేపు సెంటిమెంటు పండించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సభ్యులు తాము ఎవరికైనా చేసిన అన్యాయగానీ, ప్రేమ ఘర్షణల గురించిగానీ చెప్పమన్నారు బిగ్‌బాస్‌. సామ్రాట్‌, తేజస్వీ, హమీద్‌ మాత్రమే చెప్పారు. ఏదీ పెద్దగా కదిలించేలా లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రోజు హైదరాబాద్ పార్క్ హోటల్లో ఏం చేశావో గుర్తుందా? 'రోజాపూలు' హీరోకు శ్రీరెడ్డి షాక్