Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైఖేల్ జాక్సన్‌ చూసినప్పుడు ఆయనేదో చెప్పారు.. కానీ వినబడలేదు: ప్రభుదేవా

ముంబైలో మైఖేల్ జాక్సన్‌ను ముంబైలో చూసిన అనుభవాన్ని ప్రముఖ కొరియో గ్రాఫర్, నటుడు ప్రభుదేవా గుర్తు చేసుకున్నారు. గతంలో ముంబైలో మైకేల్ జాక్సన్‌ని ఒకసారి కలిశానని, ఆయన్ని చూసిన షాక్‌లో నోట మాట రాలేదని చెప

Advertiesment
REVEALED: When Prabhu Deva met Michael Jackson
, సోమవారం, 19 సెప్టెంబరు 2016 (12:51 IST)
ముంబైలో మైఖేల్ జాక్సన్‌ను ముంబైలో చూసిన అనుభవాన్ని ప్రముఖ కొరియో గ్రాఫర్, నటుడు ప్రభుదేవా గుర్తు చేసుకున్నారు. గతంలో ముంబైలో మైకేల్ జాక్సన్‌ని ఒకసారి కలిశానని, ఆయన్ని చూసిన షాక్‌లో నోట మాట రాలేదని చెప్పాడు. మైఖేల్ జాక్సన్‌ని కలిసిన సమయంలో ఆయన అభిమానులు, ప్రేక్షకులు విపరీతంగా ఉన్నారని, ఆ సందర్భంలో ఆయనేదో మాట్లాడారు కానీ, తనకు వినపడలేదని ప్రభుదేవా చెప్పుకొచ్చాడు. 
 
కానీ జాక్సన్ ముఖాన్ని మాత్రం అలా చూస్తుండిపోయానని వెల్లడించాడు. మైఖేల్ జాక్సన్‌ని కలిసిన సందర్భంలో ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఫొటో కూడా తీశారని, ఆ ఫొటో తన వద్ద లేదని ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవిని చూసిన అభిమానులు ఎలా ఫీలవుతారో.. మైఖేల్ జాక్సన్‌ని ముంబయిలో తాను చూసినప్పుడు అలానే ఫీలయ్యానని తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా.. హైదరాబాదులో తెరకెక్కనున్న భారీ షెడ్యూల్...