Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాన్స్ దొరికితే చెయ్యి వెయ్యాలని ప్రయత్నిస్తావా.. సుధీర్‌కు వార్నింగ్ ఇచ్చిన రష్మి

ఛాన్స్ దొరికితే చెయ్యి వెయ్యాలని ప్రయత్నిస్తావా అంటూ జబర్దస్త్ సుడిగాలి సుధీర్‌‍కు బుల్లితెర యాంకర్, నటి రష్మి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ప్రముఖ తెలుగు చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షోతో ఈ

Advertiesment
Reshmi Warning To Sudheer
, మంగళవారం, 18 అక్టోబరు 2016 (17:32 IST)
ఛాన్స్ దొరికితే చెయ్యి వెయ్యాలని ప్రయత్నిస్తావా అంటూ జబర్దస్త్ సుడిగాలి సుధీర్‌‍కు బుల్లితెర యాంకర్, నటి రష్మి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ప్రముఖ తెలుగు చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షోతో ఈ భామ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ పాపులారిటీతోనే సినిమాల్లో హీరోయిన్‌గానూ అవకాశాలు దక్కించుకుంది. గుంటూర్ టాకీస్‌తో హీరోయిన్‌గా అరంగేట్రం చేసి.. హాట్‌హాట్‌గా కనిపించిందీ భామ. 
 
అయితే అదే 'జబర్దస్త్' కామెడీషోలో పాల్గొంటున్న సుడిగాలి సుధీర్‌తో ఆమెకు ఎఫైర్ ఉందంటూ చాలా రోజులుగా ప్రచారం సాగుతూనే ఉంది. తాజాగా సుడిగాలి సుధీర్‌కు రష్మి వార్నింగ్ ఇచ్చింది. ఓ ప్రముఖ చానెల్ వచ్చే ఢీ జోడి కార్యక్రమంలో మాట్లాడిన సుధీర్.. ఢీ జోడి ప్రోగ్రామ్ పూర్తయ్యే లోపు ఎప్పుడైనా జోడీగా డాన్స్ చేయాలని తన మనసులోని మాట బయటపెట్టాడు. 
 
అంతటితో ఆగకుండా రష్మితో కొంచెం ఇంటిమేట్‌గా ప్రవర్తించాడు. ఆమె భుజాలపై చెయ్యేసి ‘నీ కోరికేంటో కూడా నాకు తెలుసు’ అంటూ కామెంట్ చేశాడు. ఆ పరిణామంతో చిర్రెత్తిపోయిన రష్మి.. ఒక్కసారిగా సుధీర్‌ను పక్కకు తోసేసింది. కాస్త గ్యాప్ మెయింటెయిన్ చేస్తే బాగుంటుందని, చాన్స్ దొరికితే చెయ్యి వెయ్యాలని ప్రయత్నిస్తుంటావని గట్టిగానే హెచ్చరించింది. వారిద్దరి మధ్య జరిగిన ఘటనను చూసిన జడ్జిలు, యాంకర్ ప్రదీప్‌లు షాకయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ సెక్సీయెస్ట్ పర్సన్.. పూనమ్ పాండే కితాబు.. స్నేహారెడ్డి ఏమంటారో?