Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలా..? చెప్పేందుకు నేనెవర్ని!!! : మాజీ భార్య రేణూ దేశాయ్

renu desai
, బుధవారం, 25 అక్టోబరు 2023 (09:06 IST)
జనసేన పార్టీ అధినేత, తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేందుు తాను ఎవరినని సినీ నటి రేణూ దేశాయ్ అన్నారు. అయితే, ఆయనలో మంచి గుణం ఉందన్నారు. పైగా, ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడు చూసుకుంటారన్నారు. దేవుడు ఏది రాసిపెడితే అదే జరుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. రవితేజ హీరోగా నటించిన కొత్త చిత్రం "టైగర్ నాగేశ్వర రావు". ఈ నెల 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో ప్రముఖ సంఘ సంస్కర్త హేమలతా లవణం పాత్రను రేణూ దేశాయ్ పోషించారు. 
 
ఈ పాత్ర అనుభవాలపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారా అని విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడుకి తెలుసని, దేవుడు ఏది రాసిపెడితే అదే జరుగుతుందన్నారు. ఈ విషయంలో అభిప్రాయం చెప్పడానికి నెనెవర్ని అంటూ ప్రశ్నించారు. ఈ అంశంపై తాను ఎటువైపు మొగ్గు చూపడం లేదన్నారు. తాను తటస్థంగా ఉంటానని చెప్పారు. ఇటీవల కూడా తాను ఉన్న నిజానే చెప్పానని, ఇవాళ కూడా అదే చెబుతున్నానని తెలిపారు. ఆ వ్యక్తికి మద్దతుగా మాట్లాడటమో, ఈ వ్యక్తికి మద్దతుగా మాట్లాడటమో చేయనని, తనుకు ఏమనిపించిందో అదే చెబుతానని వెల్లడించారు. 
 
పాకిస్థాన్‌పై ఆప్ఘన్ విజయం ... పాక్ పాలకులు వక్రబుద్ధి... 
 
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ పోటీల్లో ఆప్ఘన్ జట్టు సంచలన విజయాలను నమోదు చేస్తుంది. తొలుత డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. సోమవారం జరిగిన ఆప్ఘనిస్థాన్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఆప్ఘాన్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆప్ఘన్ ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండంటే రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మొత్తం 113 బంతుల్లో 10 ఫోర్లతో 87 పరుగులు చేశాడు. అవార్డు అందుకున్న జద్రాన్ పాక్ వెనక్కి పంపేస్తున్న ఆఫ్ఘన్ శరణార్థులకు దానిని అంకితమిస్తున్నట్టు పేర్కొన్నాడు. 
 
ఆప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు తిరిగి ఆక్రమించుకున్న తర్వాత లక్షలాదిమంది ఆఫ్ఘన్లు ఇతర దేశాలకు పారిపోయారు. ఈ క్రమంలో ఆశ్రయం కోరుతూ లక్షలాదిమంది పాకిస్థాన్ చేరుకున్నారు. ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ వారిని వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించింది. నవంబరులోగా దేశాన్ని ఖాళీ చేయాలంటూ గడువు విధించడంతో అక్కడున్న దాదాపు 1.7 మిలియన్ల మంది దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పుడు వీరందరికీ తన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అంకితమిస్తున్నట్టు ప్రకటించి తన దేశభక్తిని జద్రాన్ నిరూపించుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం గ్రాండ్ గా ప్రారంభం, మ్యూజిక్ రికార్డింగ్ బిగిన్స్