Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలయాళ నటి రెంజూషా మీనన్ ఆత్మహత్య.. ఆఖరి పోస్ట్ వైరల్

Advertiesment
Renjusha Menon
, సోమవారం, 30 అక్టోబరు 2023 (22:10 IST)
Renjusha Menon
మలయాళ నటి రెంజూషా మీనన్ సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. మరణించేనాటికి నటి వయసు 35. ఆమె తిరువనంతపురంలోని కరియమ్‌లోని తన ఫ్లాట్‌లో శవమై కనిపించింది. నటి మృతి పట్ల అభిమానులు సంతాపం తెలియజేస్తుండగా, ఆమె చివరి ఫేస్‌బుక్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆమె మృతిపై కేరళ పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు.
 
రెంజూషా మీనన్ మరణం ఆమె కుటుంబ సభ్యులను, సహోద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె విషాదకరమైన మరణ వార్త సోషల్ మీడియాలో వెలువడిన తరువాత, అభిమానులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె వివిధ సినిమాలు, సీరియల్స్‌లో నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
 
అయితే, అభిమానుల దృష్టిని ఆకర్షించింది ఏమిటంటే, ఆమె ఫేస్‌బుక్‌లో ఆమె డిప్రెషన్, విశ్వాసం, మద్దతు మొదలైన వాటి గురించి మాట్లాడిన చివరి పోస్ట్. అక్టోబర్ 16న, ఆమె ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. "నిద్ర మాత్రమే నా సౌకర్యం, అప్పుడు నేను నేను విచారంగా లేను, కోపంగా లేను, నేను ఒంటరిగా లేను, నేను సిక్ కానే కాను" అని పోస్ట్ చేసింది. 
 
అయితే మలయాళ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని నెలలుగా ఆమె ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మలయాళ సినిమాలు, టెలివిజన్ సీరియల్స్‌లో పనిచేయడమే కాకుండా, ఆమె టెలివిజన్ సీరియల్స్‌లో లైన్ ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేసింది. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 
ఇకపోతే.. కొచ్చికి చెందిన రెంజూషా మీనన్ ఓ టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆమె 'సిటీ ఆఫ్ గాడ్', 'మేరికొండూరు కుంజద్', 'లిసమ్మస్ హౌస్', 'బాంబే మార్చి 12', 'తలపావ్', 'వధ్యర్', 'వన్ వే టికెట్' వంటి అనేక చిత్రాలలో నటించింది. మలయాళ టీవీ సోప్ ఒపెరాస్ 'నిజాలట్టం', 'మకలుడే అమ్మ', 'స్త్రీ', 'బాలమణి' వంటి వాటిలో రెంజూషా తన నటనతో గుర్తింపు పొందింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరీరాన్ని హత్తుకునే ఆకుపచ్చ డ్రెస్‌తో అదరగొట్టిన నిక్కీ తంబోలి