Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దాసరినారాయణరావు కోసం దేశంకోసం టైటిల్‌ రిజిస్టర్‌ చేయించా : సి.కళ్యాణ్‌

kalyan, ashock kumar, ravendra and others
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (16:18 IST)
kalyan, ashock kumar, ravendra and others
రవీంద్ర గోపాల దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన  చిత్రం 'దేశం కోసం'. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకుని ఫిబ్రవరి 10న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్‌ లో చిత్ర యూనిట్‌ మాట్లాడారు. రవీంద్ర గోపాల్‌ ఈ సినిమాలో 14 మంది స్వాతంత్య్ర సమర యోధుల పాత్రలు పోషించాడు. ఎంతో నమ్మకం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. ఈ సినిమా తన కోసం కాదు. దేశం కోసం చేసిన సినిమా' అని అన్నారు. నేటి తరానికి గాంధీ, భగత్‌ సింగ్‌ అంటే ఎవరో తెలియని పరిస్థితి. కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తే ఎంతో మంది త్యాగఫలం మన స్వాతంత్య్రం అనే విషయం వారికి తెలియజేయడం ఈ చిత్ర కథాంశం. 
 
ముఖ్య అతిధిగా విచ్చేసిన సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ..." ట్రైలర్‌ చాలా బావుంది. సబ్‌టైటిల్స్‌ కూడా చాలా బాగా లీడ్‌ చేశారు అన్నారు. ఈ టైటిల్‌ దాసరినారాయణరావు కోసం నేను రిజిస్టర్‌ చేయించిన టైటిల్‌. కానీ మన రవీంద్రగారు నాకు ఫోన్‌ చేసి అడిగారు. ఈ చిత్రం బయటకు రావడం కోసం ఎంత ఇబ్బంది పడ్డారో నాకు బాగా తెలుసు. 14క్యారెక్టర్లు ఒక పర్సన్‌ చెయ్యడం అంటే ఆ టెన్షన్‌ మాములుగా ఉండదు. ఈ నెల 10న విడుదల చేస్తున్నారు. దేశం మీద ప్రేమ మీకు ఉంటే ఈ చిత్రం తప్పకుండా చూడండి. ఈ మూవీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
రామసత్యనారాయణ "మాట్లాడుతూ... సామాజిక స్పృహతో ఈ సినిమా తీశారు. కాబట్టి ఆయనకు ప్రతి సంవత్సరం మేము ఇచ్చే దాసరి అవార్డ్స్‌లో ఆయనకు ఒక అవార్డుని ఇస్తామని ప్రకటిస్తున్నాను. దేశభక్తి ఉందని అనుకోవడం కాదు 100రూపాయలు పెట్టి టికెట్ కొని సినిమా చూడాలి అన్నారు.
 
రైటర్‌ సూర్యప్రకాశ్‌ మాట్లాడుతూ,. "ఈ చిత్రంలోని ప్రతి డైలాగ్‌ ఎంతో అనుభవించి రాశాను. దయచేసి దేశం కోసం నిస్వార్థంగా పని చేసిన వారి కోసం తెలుసుకోవడానికి ఈ సినిమాని చూడండి అన్నారు. ఎంతో మంది స్వాతంత్య్రం కోసం పోరాడినవారు ఉన్నారు. వారిలో భగత్ సింగ్‌ గురించి తీసుకుని ఆయన పాత్రను హైలెట్‌ చేస్తూ ఇప్పటి జనరేషన్‌కి ఆయన గురించి తెలియజేయడం కోసం ఈ సినిమా చేయడం జరిగింది. అందరూ తప్పకుండా ఈ సినిమాని చూడాలి అన్నారు.
 
మ్యూజిక్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ,  "సామాజిక స్పృహ ఉన్నవారంతా మూవీ చేశారు. ఇందులో రవీంద్రగోపాల్‌గారు మొత్తం 14 పాత్రలు చేశారు. అంతేకాక ఆయన ఈ చిత్రంలో ఒక పాట రాయడమే కాకుండా ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా ఆయనే పాడారు. ఈ మంచి సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
రాఘవేంద్ర ఆర్టిస్ట్‌ మాట్లాడుతూ..."1947 బ్యాక్‌ డ్రాప్‌లో ఈ మూవీ మొత్తం ఉంటుంది. భగత్‌ సింగ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ గురించి ఈ చిత్రంలో చాలా బాగా చెప్పారు. అందరూ చూడవలసిన చిత్రమిది.
 
రవీంద్రగోపాల్‌ మాట్లాడుతూ,  ఇప్పుడున్న జనరేషన్‌కి ఆజాద్‌ చంద్రశేఖర్‌గా మా బాబుని ఈ చిత్రంలో పరిచయం చేశాను. ఇప్పటి వరకు ఎన్నో చూసి ఉంటారు. కానీ ఈ చిత్రం చూసి చెప్పండి ఎలా ఉంది అన్నది. నా సినిమా నాకు బాగానే ఉంటుంది. కానీ మీరందరూ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
డిస్ట్రిబ్యూటర్‌ శంకర్‌ మాట్లాడుతూ..." ఈ చిత్రం మంచి హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందమైన చీరలో అనసూయ..