Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భార్య సురేఖ చాలా కర్కశంగా వ్యవహరించింది : చిరంజీవి

ఆరు పదుల వయసులో ఇంత స్లిమ్‌గా తయారవ్వడానికి తాను చాల కఠినమైన శిక్షణ తీసుకోవలసి వచ్చిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇందుకోసం ఒక జిమ్ కోచ్, మరొక డైటీషియన్‌లను ఫుల్‌టైమ్‌గా తనవద్దనే పెట్టుకుని తాను ఎం

Advertiesment
నా భార్య సురేఖ చాలా కర్కశంగా వ్యవహరించింది : చిరంజీవి
, శనివారం, 7 జనవరి 2017 (10:46 IST)
ఆరు పదుల వయసులో ఇంత స్లిమ్‌గా తయారవ్వడానికి తాను చాల కఠినమైన శిక్షణ తీసుకోవలసి వచ్చిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇందుకోసం ఒక జిమ్ కోచ్, మరొక డైటీషియన్‌లను ఫుల్‌టైమ్‌గా తనవద్దనే పెట్టుకుని తాను ఎంతో కష్టపడినట్టు చెప్పాడు. 
 
ఈ సమయంలోనే తన డైటింగ్ విషయంలో తన భార్య సురేఖ చాల కర్కశంగా వ్యవహరించిందని అంటూ తన భార్య పై సెటైర్లు వేశాడు. ఇదేసందర్భంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ తన 'కాటమరాయుడు' షూటింగ్‌లో బిజీగా ఉన్నా 'ఖైదీ' ఫంక్షన్‌కు రావడానికి అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడని అయితే వాస్తవాలు తెలియక మీడియా ఎదో ఊహించుకుని రాస్తూ ఉంటుందని జోక్ చేశాడు.
 
గత నెల డిసెంబర్ 17న తమ తండ్రి ఆబ్దీకానికి వాడు (పవన్) తన ఇంటికి వచ్చి ఒక పూట పూర్తిగా ఉన్న విషయం ఎంత మందికి తెలుసు అంటూ చిరంజీవి ఎదురు ప్రశ్న వేశాడు. ఇకపోతే.. 'అమ్మడు కుమ్ముడు'పై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ ఇటువంటి విమర్శలు తాను పట్టించుకోనని కేవలం తన అభిమానులు ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే తాను ఈ సినిమాను చేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరు - పవన్‌లు కత్తులు దూసుకోవాలి.. విడిపోవాలని కోరుకుంటున్నారు : తమ్మారెడ్డి విమర్శ